మిస్త్రీ తొలగింపు షాక్: టాటాకు 17వేల కోట్ల సంపద ఆవిరి

ముంబై: దేశీయ వ్యాపార రంగంలో సంచలనం రేపిన సైరస్ మిస్త్రీ తొలగింపు వ్యవహారంతో టాటా గ్రూపులోని ఐదు లిస్టెడ్ కంపెనీలకు భారీ షాక్ తగిలింది. దేశంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒక్కటైన టాటా గ్రూప్‌ చైర్మన్‌ పదవి నుంచి సరైస్‌ మిస్త్రీని తొలగించిన ఈ రెండురోజుల కాలంలో మార్కెట్ విలువ పరంగా టాటా గ్రూప్‌ దాదాపు 17 వేలకోట్ల రూపాయలను నష్టపోయింది.

రాజీనామా చేయకుంటే ఏమవుతుందో తెలుసా?: మిస్త్రీకి రతన్ టాటా

ఈ షాకింగ్ న్యూస్‌తో రెండు ట్రేడింగ్ సెషన్లలో టాటా కంపెనీల షేర్లు దిగ్భ్రాంతికి గురి చేసిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మిస్త్రీ తొలగింపు ఐటీ కంపెనీ భవిష్యత్తుపై మరింత ప్రభావాన్ని చూపించనుందని సిటీ గ్రూపు వ్యాఖ్యానించింది.
ముఖ్యంగా టాటా గ్రూప్ కంపెనీలోని గరిష్ట మార్కెట్ క్యాప్ కలిగినఐటీ దిగ్గజం టిసిఎస్ షేర్ ఈ రెండు రోజుల్లో 1.6 శాతం నష్టపోయింది.

Mistry's Ouster Wipes Out Rs. 17,000 Crore In Market Value Of Top 5 Tata Firms

మార్కెట్ విలువలో రూ.7.788 కోట్ల రూపాయలు కోల్పోయింది. టాటా మోటార్స్ (డీవీఆర్ షేర్లు సహా) రూ.6,100 కోట్ల సంపద ఆవిరైపోయింది. ఇతర కంపెనీలు కూడా ఇదే బాటలు పయనించాయి.

టాటా స్టీల్ రూ.1,431 కోట్లు, టైటాన్ రూ.906 కోట్లు, టాటా పవర్ రూ.607కోట్ల భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అయితే మధ్యంతర బాధ్యతలను స్వీకరించిన రతన్ టాటా ఈ పరిణామాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టాటా గ్రూప్ సీఈవోల సమావేశంలో హామీ ఇచ్చారు. దీనికి బదులుగా వ్యాపారంపై తద్వారా సంస్థను మార్కెట్ లీడర్స్ గా నిలపడం పై దృష్టిపెట్టాలని కోరారు. ప్రస్తుతం రతన్ టాటానే టాటా గ్రూప్ తాత్కాలిక ఛైర్మన్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+