మిట్టల్ పఠాథిత్య.. తిరగబడ్డ బాలిక: ఆమె ధైర్యానికి దేశమంతా 'సలాం' చెప్పింది!

Subscribe to Oneindia Telugu

అహ్మదాబాద్: 12ఏళ్ల వయసు.. ఎవరైనా గట్టిగా గద్దిస్తే చాలు కన్నీళ్లతో జేబు రుమాలు తడిచిపోయే పసి మనసు. స్కూల్లో టీచర్ మందలిస్తేనే రాత్రిపూట నిద్రలో ఉలిక్కిపడే ప్రాయం అది. అలాంటిది.. తల్లిని చెరబడుతూ.. తన మీద కత్తులతో దాడికి దిగిన ఇద్దరు అగంతకులను ఓ బాలిక ప్రతిఘటించిన తీరు యావత్ దేశం ఆమెను కొనియాడేలా చేసింది.

ఆ బాలిక పేరు మిట్టల్ పఠాధిత్య. ఇంతకీ ఆరోజు ఏం జరిగిందంటే.. గుజరాత్ లోని అహ్మద్ నగర్ ప్రాంతమది. అందరు పిల్లల్లాగే ఆ ఉదయం మిట్టల్ పఠాధిత్య స్కూల్ కు వెళ్లడానికి తయారవుతోంది. ఇంతలో ఎక్కడినుంచి వచ్చారో తెలియదు గానీ.. ఓ ఆటో డ్రైవర్ మరో ఇద్దరు కలిసి ఆమె ఇంటికి వచ్చారు.

నీళ్లివ్వాలని కోరాడు:

నీళ్లివ్వాలని కోరాడు:

మిట్టల్ పఠాథిత్యను చూడగానే కొన్ని మంచినీళ్లు ఇవ్వాల్సిందిగా కోరాడు. దీంతో నీళ్లు తేవడం కోసం ఆమె కిచెన్ లోకి వెళ్లింది. మిట్టల్ నీళ్ల గ్లాసుతో తిరిగొచ్చి.. తన కళ్లెదుట జరుగుతున్న ఘోరాన్ని చూసి చలించబోయింది. తొలుత నగలు, డబ్బు కోసం తల్లిని బెదిరించిన దుండగులు.. ఆపై ఆమెను బలత్కరించడానికి ప్రయత్నించబోయారు.

తల్లిపై బలత్కారం.. మిట్టల్ ప్రతిఘటన:

తల్లిపై బలత్కారం.. మిట్టల్ ప్రతిఘటన:

తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయిన మిట్టల్.. తన చేతిలోని గ్లాసును అమ్మను బలత్కరించబోతున్న వాడి తల మీదకు విసిరేసింది. ఇంట్లో ఉన్న వస్తువుల్లో తన చేతికి దొరికిన ప్రతీ దాన్ని వాళ్ల మీదకు విసురుతూనే ఉంది. అదే సమయంలో రక్షించండి.. రక్షించండి.. అంటూ కేకలు వేస్తూనే ఉంది.

మిట్టల్‌ను కత్తితో తీవ్రంగా పొడిచి

మిట్టల్‌ను కత్తితో తీవ్రంగా పొడిచి

కోపోద్రిక్తుడైన ఒక దుండగుడు కత్తితో మిట్టల్ ను పొడిచాడు. అలా ఆపకుండా అతను పొడుస్తూనే ఉన్నా మిట్టల్ మాత్రం ప్రతిఘటించడం మానలేదు. ఆమె కొట్టిన దెబ్బలకు అప్పటికే ఓ దుండగుడు కిందపడిపోయాడు. ఈలోగా మిట్టల్ అరుపులకు చుట్టుపక్కల జనాలంతా రావడంతో.. దుండగులు తప్పించుకోలేకపోయారు.

సాహస బాలిక:

సాహస బాలిక:

స్థానికులే దుండగులను పోలీసులకు అప్పగించారు. మిట్టల్ ను ఆసుపత్రికి తరలించగా.. కత్తిపోట్లకు గురైన భాగంలో 350కుట్లు వేశారు. ఈ ఘటన జరిగిన నాలుగేళ్ల కాలానికి, అంటే 2016లొ ప్రభుత్వం ఆమెను జాతీయ సాహస బాలికల అవార్డుకు ఎంపిక చేసింది. మిట్టల్ ధైర్య సాహసాలను యావత్ దేశం ప్రశంసించింది. ఇలాంటి చిన్నారులకు 'సలాం' చెప్పకుండా ఎలా ఉండగలం..

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
She is a brave girl who fought three thieves and foiled their attempt to rob her family earlier this month, though her heroism has left her with as many as 350 stitches on her body.
Please Wait while comments are loading...