సీబీఐ, గాలి అనుచరుడు, శాసన సభ్యుడు నాగేంద్ర అరెస్టు
బెంగళూరు: బెలెకేరి హార్బర్ నుండి అక్రమంగా ఇనుప ఖనిజం విదేశాలకు తరలించిన కేసులో బళ్లారి జిల్లా లోని కూడ్లిగి శాసన సభ్యుడు బి. నాగేంద్రను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. నాగేంద్రతో సహ 7 మందిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.
బెంగళూరులో 7 మందిని విచారణ చేసిని సీబీఐ అధికారులు అరెస్టు చేసి సీబీఐ న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. 7 మందిని జూన్ 7వ తేది వరకు రిమాండ్ కు తరలించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారని గురువారం సీబీఐ అధికారులు తెలిపారు.
అక్రమ గనుల కేసులో కూడ్లిగి శాసన సభ్యుడు (స్వతంత్ర అభ్యర్థి) బి. నాగేంద్రను గతంలో సీబీఐ అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. బెయిల్ మీద బయటకు వచ్చిన నాగేంద్రను మళ్లి విచారణ చేసిన సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.

బెలెకేరి హార్బర్ లో ఉన్న ఇనుప ఖనిజాన్ని ఐఎల్ సీ ఇండస్ట్రీస్ కంపెనీ పేరుతో అక్రమంగా విదేశాలకు తరలించారని వీరి మీద కేసు నమోదు అయ్యింది. నాగేంద్రతో పాటు కె. నాగరాజు, ఫర్హాన్ షేక్, అజయ్ జార్ఖండ్, రాణి సంయుక్త, నందిని, ఎర్రిబాబు అనే 7 మందిని అరెస్టు చేశారు.
ఐఎల్ సీ ఇండస్ట్రీస్ కంపెనీ, లక్ష్మి వెంకటేశ్వర మినరల్స్, ఎఫ్ కే అసోసియేట్స్, గ్రీన్ టెక్ మైనింగ్, ఈగల్ ట్రేడర్స్ అండ్ లాజిస్టిక్స్ కంపెనీల పేరుతో 2006 నుండి 2010వ సంవత్సరం వరకు రూ. 1,300 కోట్ల విలువైన 11.61 లక్షల టన్నుల ఇనుప ఖనిజం అక్రమంగా విదేశాలకు తరలించారని ఆరోపణలు ఉన్నాయి.
అక్రమ గనుల నిర్వహణ, బెలెకేరి హార్బర్ నుండి అక్రమంగా విదేశాలకు ఇనుప ఖనిజం తరలించారని ఆరోపిస్తు సీబీఐ అధికారులు గతంలో నాగేంద్రను అరెస్టు చేశారు. బెయిల్ మీద బయటకు వచ్చిన నాగేంద్రను ఇదే కేసులో లోకాయుక్త పోలీసు అధికారులు అరెస్టు చేశారు.
తరువాత బెయిల్ మీద బయటకు వచ్చిన నాగేంద్రను రెండవ సారి విచారణ చేసిన సీబీఐ అధికారులు మళ్లి అరెస్టు చేసి జైలుకు పంపించారు. 2013 శాసన సభ ఎన్నికలలో కూడ్లిగి నియోజక వర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసిన నాగేంద్ర 71,477 ఓట్లు సంపాదించి విజయం సాదించారు.












Click it and Unblock the Notifications