వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ ఎంపి చీరెతో చేతులు తుడుచుకున్న ఎమ్మెల్యే

By Pratap
|
Google Oneindia TeluguNews

భోపాల్: మాజీ పార్లమెంటు సభ్యురాలు నీతా పతేరియా చీరెతో చేతులు తుడుచుకుంటూ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సియోనీ స్వతంత్ర శాసనసభ్యుడు దీనేష్ రాయ్ కెమెరాకు చిక్కాడు. ఈ సంఘటన బుధవారంనాడు ఓ కార్యక్రమంలో జరిగింది.

శాసనసభ్యుడిపై పతేరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికపైనే ఆమె ఆయనను దులిపేశారు. విషయాన్ని బిజెపి అధిష్టానం వద్దకు తీసుకుని వెళ్తానని ఆమె హెచ్చరించారు. శాసనసభ్యుడు కాస్తా హుందా తనం ప్రదర్శించాలని, ఆ విధమైన ప్రవర్తన మంచిది కాదని ఆమె అన్నారు.

 MLA wipes hands off ex-MP's saree, calls it a joke

అతను తనను వదినగా సంబోధించవచ్చునని, కానీ అతను తన స్థాయిని మరిచిపోవద్దని ఆమె అన్నారు. దాంతో ఇబ్బంది పడిన రాయ్ తనకూ పతేరియాకు మధ్య జరిగిన చిన్నపాటి హాస్యానికి సంబంధించిన వ్యవహారమని రాయ్ అన్నారు.

"నేను చేతులు ఎక్కడ తుడుచుకోవాలి. ఆమె నా బాబీ. చాలా కాలంగా తన వస్తువులను మోయాలని ఆమె ఆడుతోంది. హాస్యం కోసం తన చేతులు శుభ్రం చేసుకుంటానని అన్నాను. తన చేతులు చాలా శుభ్రంగా ఉన్నాయి. అది హాస్యం కోసమే. ఆమెను నేను తాకలేదు" అని రాయ్ అన్నారు.

రైతుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ సంక్షేమ, వ్యవసాయాభివృద్ధి మంత్రి గౌరీశంకర్ బిసేన్ కూడా ఉన్నారు.

English summary
An independent MLA from Seoni in Madhya Pradesh was caught on camera wiping his hands off the saree of a former Member of Parliament, Neeta Pateriya, at a public function on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X