బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మొదటికే మోసం, మొబైల్ ఫోన్లు బ్యాన్ చేసిన సీఎం, నా కొంప ముంచారు, సుప్రీం కోర్టులో !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో మాట్లాడిన ఆడియో టేప్ లీక్ కావడంతో కాంగ్రెస్ నాయకుల చేతికి పెద్ద అస్త్రం చిక్కింది. ఇదే విషయంపై సుప్రీం కోర్టులో అనర్హత ఎమ్మెల్యే అర్జీ విచారణ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలిసింది. అంతే కాదు ఆపరేషన్ కమలకు కేంద్ర మంత్రి అమిత్ షానే స్వయంగా పావులు కదిపారని సీఎం యడియూరప్ప అన్నారని ఆడియో విడుదల అయ్యిందని, ఇప్పుడు బీజేపీ నాయకులు ఏం సమాధానం చెబుతారని కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తి పోస్తోంది. ఈ విషయంపై ఉలిక్కిపడిన సీఎం యడియూరప్ప తన ఇంటిలో తనను కలవడానికి వస్తున్న వారి దగ్గర మొబైల్ ఫోన్లు నిషేధించాలని నిర్ణయించారు.

భార్య శీలం మీద అనుమానం, చెప్పినా వినలేదని 30 చోట్ల కసితీరా పొడిచి, ఓ పనైపోయింది !భార్య శీలం మీద అనుమానం, చెప్పినా వినలేదని 30 చోట్ల కసితీరా పొడిచి, ఓ పనైపోయింది !

మొబైల్ ఫోన్లు బ్యాన్

మొబైల్ ఫోన్లు బ్యాన్

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పను కలవడాని వెళ్లే బీజేపీ నాయకులు, కార్యకర్తలు మొబైల్ ఫోన్లు తీసుకురాకూడదని, వాటిని నిషేధిస్తున్నామని అధికారులు అంటున్నారు. ఇప్పటికే సీఎం బీఎస్. యడియూరప్ప తనను కలవడానికి వచ్చే వారు మొబైల్ ఫోన్లు తీసుకురాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ముందుగానే మీరు పరిశీలించి వారి దగ్గర మొబైల్ ఫోన్లు లేవని నిర్దారించుకున్న తరువాతే తన దగ్గరకు పంపించాలని సీఎం యడియూరప్ప పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిసింది.

డాలర్స్ కాలనీలో ఇంటికి బోర్డు

డాలర్స్ కాలనీలో ఇంటికి బోర్డు

బెంగళూరులోని డాలర్స్ కాలనీలో ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప నివాసం ఉంది. సీఎం యడియూరప్పను ఆయన నివాసంలో కలవడానికి వచ్చే వారు ఎవరైనా సరే మొబైల్ ఫోన్లు లోపలికి తీసుకురాకూడదని బయట ఇప్పటికే బోర్డులు ఏర్పాటు చేశారు.

సీఎం ఆడియో టేప్ తో సుప్రీం కోర్టుకు !

సీఎం ఆడియో టేప్ తో సుప్రీం కోర్టుకు !

ఆపరేషన్ కమల విషయంలో సీఎం యడియూరప్ప మాట్లాడే సమయంలో రికార్డు చేసిన ఆడియో టేప్ ఇదే అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సీఎం యడియూరప్ప ఆపరేషన్ కమల విషయంలో మాట్లాడారు అంటున్న ఆడియో టేప్ ను పరిశీలించాలని, తరువాత అనర్హత ఎమ్మెల్యే అర్జీ విచారణ పూర్తి చేసి తీర్పు చెప్పాలని సుప్రీం కోర్టులో మనవి చేశారు.

ఏం జరిగిందంటే ?

ఏం జరిగిందంటే ?

ఇటీవల హుబ్బళ్ళిలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో మాట్లాడిన సీఎం యడియూరప్ప ఆపరేషన్ కమల భాద్యతలను స్వయంగా కేంద్ర హోం మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షానే చూసుకున్నారని చెప్పారని ఆరోపణలు ఉన్నాయి. సీఎం యడియూరప్ప మాట్లాడిన ఆ ఆడియో ఇదే అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. సీఎం యడియూరప్ప మాట్లాడారు అంటున్న ఆడియో ఇప్పటికే వైరల్ అయ్యింది.

బీజేపీ క్లారిటీ

బీజేపీ క్లారిటీ

అనర్హత ఎమ్మెల్యేల అర్జీ విచారణ సుప్రీం కోర్టులో ఉందని, ఇప్పుడు నకిలీ సాక్షాలు, నకిలీ ఆడియో టేప్ లు సృష్టించి ప్రజలను, కోర్టును మోసం చెయ్యాలని ప్రయత్నిస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం నిర్వహించి తరువాత గవర్నను కలిసి యడియూరప్ప ప్రభుత్వాన్ని రద్దు చెయ్యాలని వినతి పత్రం ఇవ్వడం విడ్డూరంగా ఉందని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.

English summary
Bengaluru: For those who come to meet Chief Ministr BS Yediyurappa, mobile has been banned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X