గుజరాత్ లో ఆ నాలుగ్గంటలు మొబైల్ ఇంటర్నెట్ బంద్
గాంధీనగర్ : ప్రభుత్వోద్యోగాల కోసం నిర్వహించే రాతపరీక్షల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్న సంఘటనలు అప్పుడప్పుడు బయటపడుతోన్న సంగతి తెలిసిందే. టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ.. కొంతమంది పరీక్షల్లో అక్రమాలకు పాల్పడుతుండడంతో.. దీనికి చెక్ పెట్టడానికి గుజరాత్ ప్రభుత్వం ఓ సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. ఇటీవలే పంచాయితీ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన గుజరాత్ ప్రభుత్వం.. పరీక్ష నిర్వహించే రోజు పరీక్ష జరిగే సమయాల్లో మొబైల్ ఇంటర్నెట్ కు 'కట్' చెప్పింది.
అంటే.. ఈ నెల 16వ తేదీ ఆదివారం నాడు నిర్వహించబోయే సేవా ఆయోగ్ పరీక్ష కోసం.. ఆరోజు ఉదయం 10గం.ల నుంచి, మధ్యాహ్నాం 2గం.ల వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయనుంది గుజరాత్ సర్కార్. దీంతో పరీక్ష జరిగే నాలుగు గంటలు రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిచిపోనున్నాయి. పరీక్షల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్న ఘటనలు ఈమధ్య కాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది గుజరాత్ ప్రభుత్వం.













Click it and Unblock the Notifications