శబరిమల అయ్యప్ప ఆలయం వద్ద మొబైల్స్ నిషేధం ... కారణం ఇదే
శబరిమల అయ్యప్ప దేవాలయం వద్ద మొబైల్ ఫోన్ ల వాడకాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది కేరళ సర్కార్. శబరిమల అయ్యప్ప గుడి ప్రాంగణంలో గర్భ గుడి సమీపంలో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం విధించారు. శబరిమల అయ్యప్ప దేవాలయం విషయంలో ఇప్పటికే మహిళా భక్తులు దర్శనం చేసుకునే వివాదం కొనసాగుతుంది. ఇక తాజాగా సెల్ ఫోన్ ల వాడకాన్ని కూడా నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయం భక్తులకు షాకింగ్ న్యూస్ అని చెప్పాలి.
Recommended Video

అయ్యప్పస్వామి దేవాలయ అంతరాలయం చిత్రాలు సోషల్ మీడియా లో వైరల్
అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్న శబరిమల అయ్యప్పస్వామి దేవాలయ అంతరాలయం చిత్రాలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అత్యంత పవిత్రంగా నిష్టగా పూజాధికాలు నిర్వహించి దర్శించుకునే స్వామికి సంబంధించిన అంతరాలయ ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతుండటంతో భద్రతా పరమైన సమస్య తలెత్తకుండా ఉండేందుకు దేవస్థానం బోర్డు మొబైల్ ఫోన్లను వాడకూడదని, నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

శబరిమల సౌకర్యాలు అంబుడ్స్‌మన్, జస్టిస్ పి ఆర్ రామన్ సూచన
ఇటీవల, కొంతమంది భక్తులు గర్భగుడి మరియు ప్రధాన స్వామివారి యొక్క వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సౌకర్యాల పర్యవేక్షణ కోసం ఇటీవల శబరిమల ఆలయాన్ని సందర్శించిన దేవస్థానానికి సంబంధించిన అంబుడ్స్‌మన్, జస్టిస్ పి ఆర్ రామన్ అక్కడి సౌకర్యాలను పరిశీలించటంతో పాటు దేవస్థానం వద్ద మొబైల్స్ ను నిషేధించాలని సూచించారు.

గతంలోనూ సెల్ ఫోన్ల వాడకం పై నిషేధం .. కానీ అమలులో విఫలం
సుమారు ఏడాది క్రితం శబరిమల ఆలయంతో సహా ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు పరిధిలోని అన్ని దేవాలయాల వద్ద మొబైల్ ఫోన్ వాడకంపై నిషేధం విధించారు. కానీ దీనిని కఠినంగా ఇప్పటి వరకు అమలు చెయ్యలేదు. కానీ ప్రస్తుతం తాజా పరిణామాల నేపధ్యంలో కఠినంగా అమలు చెయ్యాలని దేవస్థానం బోర్డు భావిస్తుంది .

శబరిమల ఆలయ సమీపంలో సెల్ ఫోన్ల వాడకంపై బ్యాన్
పవిత్రమైన మెట్ల మార్గం వైపు వెళ్లే భక్తులు ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్ మాట్లాడటం కానీ, సెల్ఫోన్ వినియోగించి ఫోటోలు తీయడం కానీ చేయకూడదు. ఒకవేళ ఎవరైనా దీనిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్టు దేవస్థానం బోర్డ్ ప్రకటించింది. మొబైల్ ఫోన్స్ సీజ్ చేస్తామని హెచ్చరిస్తుంది. ఇక ఈ నిర్ణయంతో భక్తులు ఒకింత షాక్ కు గురైనా , ఇప్పటికే పలు దేవాలయాల విషయంలో ఎటువంటి నిబంధనలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ సైతం పాటిస్తారు అన్న భావన వ్యక్తమవుతుంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications