వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడల్‌పై అత్యాచారం: ఎట్టకేలకు డీఐజీపై సస్పెన్షన్!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ముంబై: మోడల్‌పై అత్యాచారం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర డీఐజీ సునీల్ పరాస్కర్‌ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. సునీల్ పరాస్కర్‌ను పోలీసు విధుల నుండి తొలగించాలని దాదాపు రంగం సిద్దమైంది. దీనికి సంబంధించిన ఫైల్ ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృద్వీ రాజ్ చవన్ వద్దకు చేరింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఉన్నతాధికారి మంగళవారం ముంబైలో వెల్లడించారు.

సునీల్ పరాస్కర్‌కు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. జులై నెల 25న సునీల్ పరాస్కర్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ముంబై మాజీ అదనపు నగర కమీషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ పరాస్కర్ 2012లో ఓ కేసు విచారణకు సంబంధించి ఆయన్ని కలిసినప్పుడు తనకు సన్నిహితంగా ఉండి తనపై లైంగిక వేధింపులు, అత్యాచారానికి పాల్పడ్డారంటూ బాధితురాలు ఆరోపించింది.

Model Rape case: Maharashtra HM recommends suspension for accused Mumbai DIG

సునీల్ పరాస్కర్ వయసు 57 సంవత్సరాలు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మలవానీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. బాధితురాలు ముంబై పోలీసు కమీషనర్ రాకేశ్ మారియాను కలిసి సునీల్ పరాస్కర్‌పై ఫిర్యాదు చేసింది. ఇది ఇలా ఉంటే సునీల్ పరాస్కర్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి నివేదికను సమర్పించాలని కేంద్ర హోంశాఖ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

సునీల్ పరాస్కర్‌ను తక్షణమే విధుల నుండి తప్పించాలని ముంబైలో ఉన్న పలు మహిళా సంఘాలు డిమాండ్ చేయడంతో మహారాష్ట్ర ప్రభుత్వం సునీల్ తగు చర్యలు తీసుకునేందుకు ముందుకి వచ్చింది.

English summary
In trouble for DIG Sunil Paraskar accused of raping a model, the Maharashtra Home Department has proposed his suspension.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X