డిసిషన్ మేకర్స్:ప్రపంచంలో మోడీ, షా.. యాంకర్ కూడా

వాషింగ్టన్: ప్రపంచాన్ని ప్రభావితం చేయగల ప్రభావశీలురైన వందమంది ఆలోచనాపరుల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్‌ షా ఉన్నారు. అమెరికాకు చెందిన ఫారిన్‌ పాలసీ మేగజైన్‌ ఈ 100 మంది జాబితాను ప్రకటించింది.

విధాన నిర్ణేతల విభాగంలో మోడీ, అమిత్ షాల పేర్లను ఆ పత్రిక చేర్చింది. మోడీని వ్యాపార అనుకూల దృష్టి ఉన్న చరిశ్మగల నేతగా పత్రిక పేర్కొంది. 2014 ఎన్నికల నాటికే తన చరిష్మా ఏమిటో మోడీ నిరూపించుకున్నారని ఆ పత్రిక వ్యాఖ్యానించింది. లక్షలాది మందిని తన ప్రసంగాలతో ఆయన కట్టిపడేస్తున్న వైనాన్ని కూడా ఉటంకించింది.

Modi, Amit Shah among top decision makers in 'Global Thinkers' list

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అఖండ విజయం సాధిండం వెనక అమిత్ షా వ్యూహాలను ప్రస్తావిస్తూ.. నరేంద్ర మోడీని తిరుగులేని అభ్యర్థిగా ప్రజల ముందు ఉంచడంలో ఆయన అసాధారణ ప్రతిభ చూపించారని పేర్కొంది.

ఈ జాబితాలో ఎస్బీఐ చైర్ పర్సన్‌ అరుంధతి భట్టాచార్య కూడా ఉన్నారు. సిజినెట్‌ స్వర ఫౌండర్‌ శుభ్రంశు చౌధరి, యాంకర్‌ పద్మిని ప్రకాష్‌, పోలియో ప్లస్‌ కమిటీ చైర్మన్‌ దీపక్‌ కపూర్‌, సంగీతా భాటియా, శాస్త్రవేత్త వీరభద్రన్‌ రామనాథన్‌, ఆర్థికవేత్త పార్థాదాస్‌ గుప్తా ఉన్నారు.

ప్రపంచంలోని 100 మంది అగ్రశ్రేణి విధాన నిర్ణేతల్లో మోడీ ప్రథమ స్థానంలో ఉంటే.. ఆయన తర్వాతి స్థానంలో జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్, అమిత్ షా నిలిచారు. అరుంధతి భట్టాచార్య గురించి పేర్కొంటి.. భారత రుణభారాన్ని గురించి కఠోర వాస్తవాలను వెల్లడించిన మహిళగా పేర్కొది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+