ఎట్టకేలకు మోడీ సర్కారు సంచలన నిర్ణయం

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో తదుపరి జనాభా లెక్కలను నిర్వహించాలని నిర్ణయించింది. అంతేగాక, జనాభా లెక్కలతోపాటు కులగణన కూడా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే జనాభా లెక్కల్లోనే దీన్ని చేర్చుతామని కేంద్రం పేర్కొంది.

ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కులగణన విషయంలో కాంగ్రెస్‌ వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణనను ఆ పార్టీ రాజకీయంగా వాడుకున్నట్లు విమర్శలు చేశారు. కాగా, 2011 తర్వాత దేశంలో జనాభా లెక్కలు జరగని విషయం తెలిసిందే.

Modi government decides to conduct caste census along with population census

మరోవైపు, దేశంలో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు చెప్పారు. మేఘాలయ, అసోం జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు వైష్ణవ్ వెల్లడించారు. 22 వేల 846 కోట్ల రూపాయలతో షిల్లాంగ్‌ నుంచి సిల్చార్‌ వరకు హైస్పీడ్‌ కారిడార్‌ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.

Take a Poll

ఇక, చెరుకు రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. క్వింటా చెరకుకు అదనంగా 15 రూపాయలను చెల్లించాలని నిర్ణయించినట్లు చెప్పారు. క్వింటా చెరకుకు 355 రూపాయలు మద్దతు ధర చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయించిందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+