వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

100శాతం గ్రామాలకు విద్యుత్ : మోడీ ప్రభుత్వంలో వెలిగిపోయిన గ్రామీణభారతం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ 2015 ఆగష్టు 15న ప్రతి గ్రామానికి 1000 రోజుల్లోగా విద్యుత్ వస్తుందని హామీ ఇచ్చారు. ఇక అన్నట్లుగానే 2018 ఏప్రిల్ 28 నాటికి మణిపూర్ రాష్ట్రంలోని లీసాంగ్ అనే ఓ కుగ్రామానికి విద్యుత్ సరఫరా చేయడం ద్వారా గ్రామాలకు 100 శాతం విద్యుత్ సరఫరా చేసి మాట నిలబెట్టుకుంది. ఆనాడు ప్రధాని వెయ్యి రోజుల్లోగా పూర్తి అవుతుందని చెప్పారు. కానీ 988 రోజుల్లోనే గ్రామీణ భారతానికి 100శాతం విద్యుత్ సరఫరా జరిగింది. గ్రామాలకు విద్యుత్ సరఫరా చేయాలన్నది ప్రధాని మోడీ మానసపుత్రిక ప్రాజెక్టుగా ఉన్నింది. తను 2014 ఎన్నికల సందర్భంగా ప్రతి గ్రామానికి విద్యుత్ ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుని తమ ప్రభుత్వం అవినీతి రహిత ప్రభుత్వంగా ముద్రవేశారు.

చివరి గ్రామానికి విద్యుత్ సరఫరా జరిగింది 28 ఏప్రిల్ 2018

చివరి గ్రామానికి విద్యుత్ సరఫరా జరిగింది 28 ఏప్రిల్ 2018

2018 ఏప్రిల్ 29 భారత చరిత్రలో మరుపురాని రోజుగా మిగిలిపోతుందని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. అభివృద్ధి ప్రయాణంలో భారత్ మరో మైలురాయిని చేరుకుందని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఏప్రిల్ 28 చివరి గ్రామానికి విద్యుత్ సరఫరా చేయడం ద్వారా తమ ప్రభుత్వం మాటనిలబెట్టుకుందని ఇకపై ప్రజల జీవితాలు పరివర్తన చెందుతాయని చెప్పారు. ప్రతి గ్రామానికి విద్యుత్ అందడం నిజంగా సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు.

 1947 నుంచి 2018 వరకు గ్రామాలకు అందిన విద్యుత్ లెక్కలు

1947 నుంచి 2018 వరకు గ్రామాలకు అందిన విద్యుత్ లెక్కలు

1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే నాటికి 1500 గ్రామాలకు మాత్రమే విద్యుత్ సరఫరా అయ్యేది. 1991 నాటికి ఆ సంఖ్య 4,81,124కు చేరింది. ఇక విద్యుత్ శాఖ అందించిన నివేదిక ప్రకారం 5,97,464 గ్రామాలు ఉంటే అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా జరుగుతోందని వెల్లడించింది. అంటే 100శాతం గ్రామాలకు విద్యుత్ అందుతోందని పేర్కొంది. 100శాతం గ్రామాలకు విద్యుత్ సరఫరా జరిగిందంటే... అన్ని ఇళ్లకు విద్యుత్ అందినట్లు కాదని.. కనీసం గ్రామంలో 10శాతం ఇళ్లకు విద్యుత్ సరఫరా చేసినట్లయితే లక్ష్యం నెరవేరినట్లుగానే చూడాలని పేర్కొంది. అంతేకాదు బహిరంగ స్థలాలు అంటే పాఠశాలలు, పంచాయతీ ఆఫీసులు, ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ సెంటర్లకు విద్యుత్ సరఫరా జరిగితే 100శాతం విద్యుత్ అందించినట్లుగానే భావించాల్సి ఉంటుందని విద్యుత్ శాఖ వెల్లడించింది.

మిగులు విద్యుత్ ఉన్న దేశంగా భారత్‌కు గుర్తింపు

మిగులు విద్యుత్ ఉన్న దేశంగా భారత్‌కు గుర్తింపు


ఇక గ్రామాల్లో విద్యుత్ సరఫరా చేయడం వల్ల భారత్ అధిక విద్యుత్ ఉన్న దేశంగా గుర్తింపు పొందింది. ఇది బీజేపీ సర్కార్‌లోని విద్యుత్ శాఖ ఇందుకు చాలా కృషి చేసింది. మోడీ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ అత్యధిక ఫలితాలు చూపించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బీజేపీ హయాంలోనే తొలిసారిగా భారత్ మిగులు విద్యుత్ ఉన్న దేశంగా గుర్తింపు పొందింది. ఇది విద్యుత్‌ తయారుకు కావాల్సిన ముడిసరుకు అందించే వివిధ శాఖల మధ్య సమన్వయంతోనే ఇది సాధ్యమైంది.

English summary
Prime Minister Narendra Modi had promised on 15 August 2015 that every village in the country would be electrified within 1,000 days. When Leisang, a tiny village in Manipur, was electrified on April 28, 2018, the Modi government achieved 100% electrification of rural India and it was done in 988 days of making that promise.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X