వెనక్కి తగ్గిన అమెరికా: మోడీతో పావెల్ భేటీ (పిక్చర్స్)

గాంధీనగర్: అమెరికా రాయబారి నాన్సీ పావెల్ భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని ఆయన నివాసంలో గురువారం సమావేశమయ్యారు. 2002లో గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో గత తొమ్మిదేళ్లుగా అమెరికా మోడీకి వీసా నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా రాయబారి నాన్సీ పావెల్.. మోడీతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సమావేశంలో గుజరాత్ అన్ని రంగాల్లో సాధించిన ప్రగతిని, పారిశ్రామికాభివృద్ధిని, అభివృద్ధికి నమూనాగా గుజరాత్‌ను తీర్చిదిద్దిన విధానాన్ని మోడీ అమెరికా అధికారులకు వివరించినట్లు సమాచారం. మోడీతో భేటీ అయిన వారిలో బ్రిటీష్ హై కమీషనర్ జేమ్స్ బేవాన్, జర్మన్ రాయబారి మైకేల్ స్టెయినర్, యూరోపియన్ యూనియన్ అధికారులు ఉన్నారు.

త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ సారథ్యంలోని బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని అనేక సర్వేలు వెల్లడిస్తుండటంతో ఆయనతో సంబంధాలను మెరుగుపర్చుకోవడంలో భాగంగానే అమెరికా ఈ విధంగా ముందుకు సాగుతోందని పలువురు భావిస్తున్నారు. మోడీపై విధించిన వీసా నిరాకరణను కూడా సడలించే అవకాశాలున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అయితే వీసా విధాన నిబంధనల్లో మార్పు లేమీ లేవని అమెరికా అధికారులు తోసిపుచ్చుతున్నారు. భారత్, అమెరికా దౌత్య సంబంధాలను మరింత పటిష్టపరిచేందుకు గత నవంబరు నుంచి చేపట్టిన సీనియర్ రాజకీయ వేత్తలు, దౌత్యవేత్తలను కలిసే కార్యక్రమంలో భాగమే ఈ భేటీ అని వారు పేర్కొంటున్నారు. కాగా వీసా కోసం మోడీ దరఖాస్తు చేసుకోవచ్చని, అందరు అభ్యర్థుల్లానే ఆయన దరఖాస్తును పరిశీలించి వీసా జారీ విషయంపై నిర్ణయం తీసుకుంటామని గతంలో అమెరికాకు చెందిన ఓ సీనియర్ చెప్పారు.

పుష్పగుచ్ఛంతో స్వాగతం

పుష్పగుచ్ఛంతో స్వాగతం

అమెరికా రాయబారి నాన్సీ పావెల్ భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని ఆయన నివాసంలో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోడీ ఆమెకు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు.

స్నేహహస్తం

స్నేహహస్తం

అమెరికా రాయబారి నాన్సీ పావెల్ భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని ఆయన నివాసంలో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాన్సీ పావెల్‌తో కరచాలనం చేసిన మోడీ.

మోడీతో భేటీ

మోడీతో భేటీ

అమెరికా రాయబారి నాన్సీ పావెల్ భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని ఆయన నివాసంలో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోడీతో చర్చలు జరుపుతున్న నాన్సీ పావెల్.

పావెల్‌తోపాటు పాల్గొన్న విదేశీ అధికారులు

పావెల్‌తోపాటు పాల్గొన్న విదేశీ అధికారులు

అమెరికా రాయబారి నాన్సీ పావెల్ భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని ఆయన నివాసంలో గురువారం సమావేశమయ్యారు. మోడీతో భేటీ అయిన వారిలో బ్రిటీష్ హై కమీషనర్ జేమ్స్ బేవాన్, జర్మన్ రాయబారి మైకేల్ స్టెయినర్, యూరోపియన్ యూనియన్ అధికారులు ఉన్నారు.

జ్ఞాపిక

జ్ఞాపిక

అమెరికా రాయబారి నాన్సీ పావెల్ భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని ఆయన నివాసంలో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాన్సీ పావెల్‌కు జ్ఞాపికను అందిస్తున్న దృశ్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+