ట్రంప్ కు చిర్రెత్తుకొచ్చే ఫొటో..! ఒకే ఫ్రేమ్ లో మోడీ-పుతిన్-జిన్ పింగ్ ..!
ప్రపంచ పెద్దన్నగా భావించే అమెరికాకు, దాని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూ ఇవాళ న్యూఢిల్లీలో ప్రారంభమైన బ్రిక్స్ సదస్సు ద్వారా ప్రధాని మోడీ (PM Modi) ఓ పెద్ద సందేశమే పంపారు. అమెరికా అంటేనే మండిపడే, లేదా ఎవరిని చూస్తే అమెరికా మండిపడుతుందో అలాంటి పవర్ ఫుల్ దేశాధినేతలతో ప్రధాని మోడీ ఫొటో దిగారు. అదీ ముగ్గురూ నవ్వుకుంటూ, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటూ. ఈ ఫొటో చూస్తే కచ్చితంగా డొనాల్ట్ ట్రంప్.. షాక్ కావడం ఖాయం అన్నట్లుగా ఇది ఉంది.
పాశ్చాత్య దేశాల ఆధిపత్యానికి గండికొట్టేలా బ్రిక్స్ దేశాలు ఓవైపు పావులు కదుపుతున్నాయి. ఇందులో కమ్యూనిస్టు దేశాలైన రష్యా-చైనా నేరుగా అమెరికాకు నిత్యం సవాళ్లు విసురుతూనే ఉన్నాయి. అలాగే ఇరాన్ వంటి అమెరికా బద్ధ శత్రువులైతే ఇక వారి డాలర్ కు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చేసిందంటూ పిలుపులిస్తున్నాయి. ఇలాంటి సమయంలో బ్రిక్స్ సదస్సుకు హాజరైన చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ తో కలిసి ప్రధాని మోడీ ఫొటో దిగారు. అందులో వారు సంతోషంగా నవ్వుతూ కనిపిస్తున్నారు.

బ్రిక్స్ వేదికగా ప్రధాని మోడీ చేసిన ప్రసంగంలో పాశ్చాత్యదేశాలను ఉద్దేశించి తమకు ఎవరూ శత్రువులు కాదంటూ ఓ సందేశం పంపే ప్రయత్నం చేశారు. అదే సమయంలో విధానాల పరంగా తమతో ఏకీభవిస్తున్న చైనా, రష్యా దేశాధినేతల్ని కలుపుకుంటూ ప్రధాని మోడీ బ్రిక్స్ వేదికగా కనిపించడం ట్రంప్ కు మంటపుట్టించడం ఖాయమని విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే తమకు వాణిజ్య పరంగా, సైనిక పరంగా సవాళ్లు విసురుతున్న చైనా, రష్యాలు భారత్ తో జత కడితే ఇక ఈ త్రయాన్ని ఆపడం కష్టమని ట్రంప్ కూ తెలుసు కాబట్టి. అందుకే ఈ ఫొటోపై ట్రంప్ ఎలా స్పందిస్తారో అని ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.














Click it and Unblock the Notifications
