ఇందిరకు ఘన నివాళి, ట్విట్టర్ ద్వారా మోడీ(ఫోటోలు)

న్యూఢిల్లీ: దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 30వ వర్థంతి సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శ్రద్ధాంజలి ఘటించారు.

శుక్రవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ సమాధి శక్తిస్థల్‌ వద్ద జరిగిన కార్యక్రమంలో సోనియా గాంధీతోపాటు ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, పలువురు కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హామీద్ అన్సారీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇందిరా గాంధీ సేవల్ని ప్రముఖులు గుర్తు చేసుకున్నారు.

ఇది ఇలా ఉంటే ఇందిరాగాంధీ వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం కాంగ్రెస్‌ పార్టీకి ఆగ్రహం కలిగించింది. ఎన్డీయే వైఖరి దురదృష్టకరమంటూ కాంగ్రెస్‌ నాయకులు మండిపడ్డారు. దేశం కోసం ప్రాణాలు వదిలిన ఇందిరాగాంధీని విస్మరిస్తారా అంటూ కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశానికి ఇందిరా గాంధీ ఎనలేని సేవలు చేశారని, ఆమె త్యాగాలను గౌరవించడం కేంద్రం బాధ్యత అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మనీశ్ తివారీ పేర్కొన్నారు. ఇందిరా గాంధీ దేశం కోసం బతికారని, దేశం కోసమే బలయ్యారని తెలిపారు. ఆమెకు విశిష్ట రీతిలో గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఒకవేళ అలా గౌరవించలేకపోతే, ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పంచుకుంటుందని తివారీ అభిప్రాయపడ్డారు.

ఇందిరకు ప్రముఖుల నివాళి, ట్విట్టర్ ద్వారా మోడీ

ఇందిరకు ప్రముఖుల నివాళి, ట్విట్టర్ ద్వారా మోడీ

దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 30వ వర్థంతి సందర్భంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ సమాధి శక్తిస్థల్‌ వద్ద నివాళర్పిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ.

ఇందిరకు ప్రముఖుల నివాళి, ట్విట్టర్ ద్వారా మోడీ

ఇందిరకు ప్రముఖుల నివాళి, ట్విట్టర్ ద్వారా మోడీ

దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 30వ వర్థంతి సందర్భంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ సమాధి శక్తిస్థల్‌ వద్ద నివాళర్పిస్తున్న మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్.

ఇందిరకు ప్రముఖుల నివాళి, ట్విట్టర్ ద్వారా మోడీ

ఇందిరకు ప్రముఖుల నివాళి, ట్విట్టర్ ద్వారా మోడీ

దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 30వ వర్థంతి సందర్భంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ సమాధి శక్తిస్థల్‌ వద్ద నివాళర్పిస్తున్న కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ.

 ఇందిరకు ప్రముఖుల నివాళి, ట్విట్టర్ ద్వారా మోడీ

ఇందిరకు ప్రముఖుల నివాళి, ట్విట్టర్ ద్వారా మోడీ

దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 30వ వర్థంతి సందర్భంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ సమాధి శక్తిస్థల్‌ వద్ద నివాళర్పిస్తున్న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ.

 ఇందిరకు ప్రముఖుల నివాళి, ట్విట్టర్ ద్వారా మోడీ

ఇందిరకు ప్రముఖుల నివాళి, ట్విట్టర్ ద్వారా మోడీ

దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 30వ వర్థంతి సందర్భంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ సమాధి శక్తిస్థల్‌ వద్ద నివాళర్పిస్తున్న మాజీ కేంద్ర మంత్రులు గులాం నబీ ఆజాద్, సుశీల్ కుమార్ షిండే.

 ఇందిరకు ప్రముఖుల నివాళి, ట్విట్టర్ ద్వారా మోడీ

ఇందిరకు ప్రముఖుల నివాళి, ట్విట్టర్ ద్వారా మోడీ

దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 30వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులర్పిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు పొన్నాల లక్ష్యయ్య, డి. శ్రీనివాస్, అంజన్ కుమార్ యాదవ్.

 ఇందిరకు ప్రముఖుల నివాళి, ట్విట్టర్ ద్వారా మోడీ

ఇందిరకు ప్రముఖుల నివాళి, ట్విట్టర్ ద్వారా మోడీ

దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 30వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులర్పిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు పొన్నాల లక్ష్యయ్య, అంజన్ కుమార్ యాదవ్.

 ఇందిరకు ప్రముఖుల నివాళి, ట్విట్టర్ ద్వారా మోడీ

ఇందిరకు ప్రముఖుల నివాళి, ట్విట్టర్ ద్వారా మోడీ

దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 30వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులర్పిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు.

ఈ విషయంపై ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ అక్టోబర్ 31 సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి అని ఆయన తన జీవితాన్ని జాతి సమగ్రత కోసం అంకితం చేశారని అన్నారు. ఐతే 30 ఏళ్ల క్రితం దురదృష్టవశాత్తూ అదే రోజూ దారుణం చోటుచేసుకుందని అన్నారు.

<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>I join my fellow countrymen & women in remembering former PM Smt. Indira Gandhi on her Punya Tithi.</p>— Narendra Modi (@narendramodi) <a href="https://twitter.com/narendramodi/status/528001506113368064">October 31, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం చరిత్రను, వారసత్వాలను చీల్చవద్దని మోడీ పేర్కొన్నారు. కాగా ఇందిరాగాంధీకి ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా నివాళులు అర్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+