నమో గంగా స్మరమి : గంగాదేవికి మోదీ పూజలు
వారణాసి : కాశీ విశ్వేశ్వరుడి సన్నిధిలో ప్రధాని మోదీ నిర్వహించిన రోడ్ షోకు జనం బ్రహ్మారథం పట్టారు. దారి పొడవునా మోదీ అనే నినాదాలు మిన్నంటాయి. రోడ్ షోలో భాగంగా జనానికి చేయి ఊపుతూ మోదీ ముందుకుసాగారు. బనారస్ వర్సిటీ వద్ద మదన్ మోహన్ మాలవ్య విగ్రహానికి పూలమాల వేసి రోడ్ షో ప్రారంభించారు. మొత్తంగా 6 కిలోమీటర్లు మోదీ రోడ్ షో కొనసాగింది.

హారతి కార్యక్రమం
రోడ్ షో ముగిసాక దశాశ్వమేధ ఘాట్ వద్ద గంగా హారతి కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి గంగా అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. గంగా హారతి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు మోదీ. ఘాట్ వద్ద పూజారులతోపాటు మోదీ కూడా మంత్రోచ్చరణలు చేశారు. ఈ కార్యక్రమంలో మోదీతోపాటు బీజేపీ చీఫ్ అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.
రేపు నామినేషన్
షెడ్యూల్ ప్రకారం గంగాహారతి తర్వాత 3 వేల మంది ఇంటలెక్చువల్స్‌తో మోదీ సమావేశమవుతారు. తర్వాత రాత్రి వారణాసిలోని హోటల్ లో మోదీ బస చేస్తారు. రేపు వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేస్తారు మోదీ.












Click it and Unblock the Notifications