Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నటనలో బిగ్ బీ ని మించిన మోదీ..! ప్రధానిగా అమితాబచ్చన్ ని ఎన్నుకావాల్సిందన్న ప్రియాంక..!!

మిర్జాపూర్‌/హైదరబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీని గొప్ప నటుడిగా ఆమె అభివర్ణించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ... 'ప్రపంచంలోనే గొప్ప నటుడిని మీరు (ప్రజలు) ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. ఆయనను ప్రధానిగా ఎన్నుకోవడం కన్నా బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ను ఎన్నుకుంటే చాలా బాగుండేది. ఏదేమైనా, వారిద్దరూ మీ కోసం ఏమీ చేయలేదు' అని వ్యాఖ్యానించారు.

Modis Bigger Performance than big B..! Priyankas choice of Amitabhachan as PM

'ఈ ఎన్నికలకు చాలా ప్రాముఖ్యత ఉందని. మన ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుకోవడం కోసం మనం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని ప్రియాంక తెలిపారు. ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రియాంకా గాంధీ వ్యాఖ్యానించారు. కాగా, ఏడో దశ (చివరి దశ) లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని 13 స్థానాల్లో మే 19న పోలింగ్‌ జరగనుంది. శుక్రవారంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఎన్నికలు జరగనున్న నియోజక వర్గాల్లో తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రియాంక ప్రచారంలో పాల్గొంటున్నారు. శుక్రవారం మిర్జాపూర్‌, ఖుషీనగర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+