వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ ఓకే: ఇప్పుడు ఎన్నికలొచ్చినా 300పైనే సీట్లు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ పనితీరుపై దేశ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఎన్‌డీఏ ప్రభుత్వ పనితీరు కన్నా ప్రధాని మోడీ పని తీరుకు ప్రజలు ఎక్కువ రేటింగ్‌ ఇచ్చారు. ఏబీపీ న్యూస్‌-నీల్సన్‌ నిర్వహించిన ఒపీనియన్‌ పోల్‌లో ప్రభుత్వం బాగుంది లేదా చాలా బాగుంది అని 46శాతం మంది చెప్పారు.

కాగా, మోడీకి ఇంతకన్నా ఎక్కువ రేటింగ్‌ లభించింది. ఆయన పనితీరు బాగుంది లేదా చాలా బాగుంది అని 54శాతం మంది చెప్పారు. లోక్‌సభ ఎన్నికలు ఇప్పటికిప్పుడు(బుధవారం) నిర్వహించినట్లయితే ఎన్‌డీఏకు 38శాతం ఓట్లతో 301 స్థానాలు లభించవచ్చని ఈ పోల్‌ పేర్కొంది.

 Modi's popularity still intact! NDA to get 301 seats if polls to be held today, says Survey

2014, మేలో నిర్వహించిన ఎన్నికల్లో ఎన్‌డీఏకు 339 స్థానాలు లభించాయి. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏకు 28శాతం ఓట్లతో 108 స్థానాలు రావచ్చని ఈ పోల్‌ వెల్లడించింది. గత ఎన్నికల్లో యూపీఏకు 62స్థానాలు వచ్చాయి.

బిజెపికి 43శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 14శాతం ఓట్లు, ఆమ్‌ఆద్మీ పార్టీకి 4 శాతం ఓట్లు లభించవచ్చని ఈ ఒపీనియన్‌ పోల్‌లో వెల్లడైంది. మోడీ ఆదరణ రోజు రోజుకూ తగ్గుతోందని దాదాపు 47శాతం మంది ఈ సర్వేలో అభిప్రాయపడగా, 45శాతం మంది అందుకు భిన్నంగా స్పందించారు.

English summary
It looks like Modi government's popularity is still intact despite many attempts by Opposition to malign it. According to a survey, Modi-led NDA has maintained its credibility among people who voted them to power in May 2014.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X