రోతపుట్టిస్తున్న నేతలను కడిగేయండి: మోడీకి శివసేన, నోబెల్ ఇవ్వాలని సెటైర్
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీకి చెందిన కొందరు పార్లమెంటుసభ్యులు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీపై మిత్రపక్షపైన శివసేన పార్టీ మరోసారి విమర్శలు గుప్పించింది. ముఖ్యమైన విషయాల్లో కూడా సొంత పార్టీ నేతలు అవాకులు చెవాకులు పేలుతుంటే స్పందించకుండా ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించింది.
మహాత్మాగాంధీ స్ఫూర్తితో దేశాన్ని పరిశుభ్ర భారత్‌గా తీర్చిదిద్దేందుకు చేపట్టిన ‘స్వచ్ఛ భారత్'తో రోతపుట్టించే వ్యాఖ్యలు చేస్తున్న దిలీప్ గాంధీ లాంటి నేతలను కూడా కడిగేయాలని కోరింది. ఈ మేరకు శివసేన అధికారిక పత్రిక ‘సామ్నా'లో పేర్కొంది.

పొగాకు వాడకంపై బిజెపి ఎంపి దిలీప్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పొగాకు వినియోగంవల్ల క్యాన్సర్ రాదనే కొత్త విషయాన్ని ఆవిష్కరించిన ఎంపీ దిలీప్‌కు ఖచ్చితంగా నోబెల్ బహుమతి అందించాలని, ఆయన డాక్టర్ కాకపోయినా ఆ అవార్డు ఇవ్వాల్సిన అవసరం మనకుందని ఎద్దేవా చేసింది.
అంత గొప్ప ఆవిష్కరణ చేసి పొగాకును వ్యతిరేకించే వారందరి దిమ్మతిరిగిపోయేలా చేశారని హేళన చేసింది. ముంబైలోని టాటా ఆస్పత్రిలో 100 మంది క్యాన్సర్ పేషేంట్లు ఉండగా వారిలో 60 నుంచి 65 మంది పొగాకు వల్ల క్యాన్సర్ బారిన పడ్డవారున్నారని పేర్కొంది. పొగాకుపై వైద్యులు ఇంతగా ఆందోళన చెందుతుంటే, గాంధీ మాత్రం విస్తృతంగా పొగాకు ఉత్పత్తులపై ప్రచారం చేస్తున్నారని చెప్పారు. దీనిపై ప్రధాని మోడీ స్పందిచాలని డిమాండ్ చేసింది.
కాగా, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న నేతల గురించి కేంద్రమంత్రి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు నుంచి మోడీ వివరాలు సేకరించినట్లు తెలిసింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications