వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియాకు ఎపికి వెళ్లే ధైర్యంలేదు, చిన్న కోర్కెలు: మోడీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం కర్నాటకలోని దావణగెరెలో జరిగిన బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశంపై స్పందించారు. విభజన విషయంలో కాంగ్రెసు పార్టీ అహంభావంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సీమాంధ్ర ప్రాంతం వారు అడుగుతున్న చిన్నచిన్న కోర్కెకలను కూడా కాంగ్రెసు పార్టీ తీర్చడం లేదన్నారు.

అహంకారపూరిత కాంగ్రెసు పార్టీ నుండి దేశానికి విముక్తి కలిగించాల్సిన అవసరముందన్నారు. విభజన ద్వారా సీమాంధ్ర, తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల వల్లే కేంద్రంలో కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం నిలబడిందన్నారు. అయినా సీమాంధ్ర ప్రజల చిన్న చిన్న కోర్కెలను కూడా మన్నించి పరిస్థితిలో కాంగ్రెసు పార్టీ లేకపోవడం దురదృష్టకరమన్నారు.

Modi takes a dig at Sonia Gandhi, Rahul

సీమాంధ్రుల విషయంలో కాంగ్రెసు పార్టీ అహంకారంతో, అహంభావంతో వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు పోయే ధైర్యం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి లేదన్నారు. కాంగ్రెసు అహంకారం దేశాన్ని నాశనం చేస్తోందని మండిపడ్డారు. అహంభావంతో ఉన్న కాంగ్రెసు పార్టీని ఎందుకు సమర్థించాలన్నారు. కాంగ్రెసు పార్టీని శిక్షించాలన్నారు. కాంగ్రెసు పార్టీని భారతీయ సమాజం అసహ్యించుకుంటోందన్నారు.

జాతిపిత మహాత్మా గాంధీ చెప్పినట్లు మానవ సేవే మాధవ సేవనుతాము అనుసరిస్తామన్నారు. కాంగ్రెసు పార్టీకి అధిష్టానం ఓ కుటుంబం అని, ఆ పార్టీ మొత్తాన్ని ఆ కుటుంబం చెరబట్టిందన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఉండని కాంగ్రెసు పార్టీని ఎందుకు సహించాలన్నారు. నకిలీ గాంధీల హయాంలో కాంగ్రెసు పార్టీ ఆలోచన వైఖరి మారిపోయిందన్నారు. విభజించు పాలించు అన్నది కాంగ్రెసు నినాదమైతే, సమైక్యంగా ఉంచాలన్నది తమ ఆలోచన అన్నారు.

మహాత్ముడు చెప్పినట్లు మానవ సేవే మాధవ సేవను తాము అనిసరిస్తాం, కాంగ్రెసు పార్టీకి అధిష్టానం ఓ కుటుంబం చేతిలో, పార్టీ మోత్తాన్ని ఆ కుటుంబం చెరబట్టింది, ప్రజాస్వామ్యయుతంగా ఉండని కాంగ్రెసు పార్టీని ఎందుకు సహించాలి, నకీలీ గాంధీల హయాంలో కాంగ్రెసు పార్టీ ఆలోచనా వైఖరిని పక్కన, విభజించు పాలించు అన్నది కాంగ్రెసు విధానం, సమైక్యంగా ఉంచాలన్నది మా ఆలోచన, కాంగ్రెసు ను భారతీయ సమాజం అసహ్యించుకుంటుంది,

English summary
BJP's prime ministerial candidate Narendra Modi addressed 'Bharatha Gellisi' rally in Davangere where he spoke to the public.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X