Modi-Xi Jinping: కలిసే ముందుకెళ్దాం- మోడీ-షీ జిన్ పింగ్ ప్రతిన..!

న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో భాగంగా భారత్, చైనా దేశాధినేతలు మోడీ-షీ జిన్ పింగ్ (Modi-Xi Jinping Meeting) ఇవాళ సమావేశమయ్యారు. చాలా కాలం తర్వాత వీరిద్దరూ కలుసుకున్నారు. కోవిడ్ సమయంలో గల్వాన్ ఘర్షణల తర్వాత మోడీ-జిన్ పింగ్ భారత్ లో సమావేశం కావడం ఇదే తొలిసారి. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యంగా ఇరుదేశాల మధ్య సరిహద్దు వివాదాలు, ఇతర సమస్యలు నెలకొన్న నేపథ్యంలో వీరిద్దరూ ద్వైపాక్షిక చర్చల్లో ఆహ్లాదంగా కనిపించారు.

BRICS Summit: పాశ్చాత్యదేశాలకు మోడీ క్లారిటీ..! బ్రిక్స్ వ్యతిరేకతకు దూరంగా..!
BRICS Summit: పాశ్చాత్యదేశాలకు మోడీ క్లారిటీ..! బ్రిక్స్ వ్యతిరేకతకు దూరంగా..!

గత కొంతకాలంగా ఇరుదేశాల మధ్య నెలకొన్న దౌత్యపరమైన విభేదాల తర్వాత ఇరు దేశాధినేతలు ముఖాముఖి భేటీ కావడం అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశంగా మారింది. గత ఏడేళ్ల కాలంలో చైనా దేశాధ్యక్షుడు భారతదేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. గాల్వాన్ సరిహద్దు ఉద్రిక్తతల అనంతరం దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను మళ్లీ పునరుద్ధరించే దిశగా ఈ సమావేశం ఒక కీలక అడుగుగా మారుతుందని భావిస్తున్నారు. ఈ భేటీ సందర్భంగా ఇరు నేతలు ఆత్మీయంగా కరచాలనం చేసుకుని చర్చలను ప్రారంభించారు. ప్రధానంగా వివాదాస్పద సరిహద్దు భద్రత సమస్యలతో పాటు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై వీరు చర్చిస్తున్నారు.

Modi-Xi Jinping Meeting Begins India-China Border Trade Issues in Focus
ట్రంప్ కు చిర్రెత్తుకొచ్చే ఫొటో..! ఒకే ఫ్రేమ్ లో మోడీ-పుతిన్-జిన్ పింగ్ ..!
ట్రంప్ కు చిర్రెత్తుకొచ్చే ఫొటో..! ఒకే ఫ్రేమ్ లో మోడీ-పుతిన్-జిన్ పింగ్ ..!

భారత్అధ్యక్ష హోదాలో బ్రిక్స్ సదస్సు నిర్వహిస్తున్న నేపథ్యంలో.. తమకు చైనా ప్రభుత్వం అందించిన సహకారానికి, మద్దతుకు ప్రధాని మోదీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. భారత్‌కు విచ్చేసిన జిన్‌పింగ్‌కు ఆయన ఘన స్వాగతం పలికారు. ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి, భవిష్యత్ ప్రణాళికలపై చర్చించడానికి ఈ ద్వైపాక్షిక వేదిక అత్యంత అనుకూలమైన అవకాశాన్ని కల్పిస్తుందని మోదీ తన ప్రారంభోపన్యాసంలో తెలిపారు. అటు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కూడా దీనికి సానుకూలంగా స్పందించారు. భారత్, చైనాలు అంతర్జాతీయంగా ప్రగతి సాధించడమే కాకుండా కీలకమైన అంతర్జాతీయ బాధ్యతలను భుజాన వేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రెండు దేశాల అంతర్గత పరిస్థితులు వేరువేరుగా ఉన్నప్పటికీ, ఒకరి బలాలు మరొకరు గ్రహించి సాగుతూ పరస్పర అభివృద్ధి దిశగా అడుగులు వేయవచ్చని జిన్‌పింగ్ స్పష్టం చేశారు. పరస్పర సహకారం ద్వారా మాత్రమే దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందవచ్చన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+