మోహన్ భగవత్ కాన్వాయ్‌ని ఢీకొట్టిన కారు, సేఫ్
హైదరాబాద్: కారు ఢీకొన్న సంఘటనలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి గోపినాథ్ ముండే మరణించిన విషయాన్ని మరిచిపోక ముందే అటువంటి సంఘటనే మరోటి చోటు చేసుకుంది. హర్యానా రిజిస్ట్రేషన్ నెంబర్‌తో ఉన్న ఓ కారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కాన్వాయ్‌ని ఢీకొట్టింది.
మోహన్ భగవత్ విమానాశ్రయానికి వెళ్తుండగా ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో ఈ సంఘటన మధ్యాహ్నం గం.12.15 నిమిషాల ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎవరు కూడా గాయపడలేదు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు.

మోహన్ భగవత్ ఢీకొట్టిన కారు నెంబర్‌ను ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తీసుకుని ట్రాఫిక్ పోలీసులకు అందించారు. భగవత్ సురక్షితంగా ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధి రామ్ మాధవ్ చెప్పారు.
భగవత్ వాహనం ప్రమాదానికి గురి కాలేదని, వెనక ఉన్న సెక్యూరిటీ వాహనాన్ని కారు ఢీకొట్టిందని ఆయన ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications