Press meet: ప్రెస్ మీట్ పెట్టి టేబుల్ మీద రూ. 10 లక్షలు పెట్టిన మాజీ మంత్రి, ఎందుకంటే ?
బెంగళూరు/ హాసన్: మాజీ ప్రధాన మంత్రి కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి అన్న, మాజీ మంత్రి అయిన హెచ్.డి. రేవణ్ణ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ప్రెస్ మీట్ పెట్టి మీడియా సభ్యులు అందర్ని పిలిచారు. ప్రెస్ మీట్ పెట్టిన మాజీ మంత్రి ఒక్కసారిగా టేబుల్ మీద రూ. 10 లక్షల నోట్లకట్టలు పెట్టారు. ప్రెస్ మీట్ కు వెళ్లిన మీడియా సోదరులు ఆ సీన్ చూసి షాక్ అయ్యారు. సార్.... ఎందుకు అంత డబ్బు టేబుల్ మీద పెట్టారు అని ప్రశ్నిస్తే మాజీ ప్రధాని కొడుకు హెచ్.డి. రేవణ్ణ ఒక్కాసారిగా సీఎం పీఏ మీద విరుచుకుపడ్డారు.

మాజీ ప్రధాని కుమారుడు
భారత మాజీ ప్రధాన మంత్రి హెచ్.డి. దేవేగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్. డి. కుమారస్వామి అన్న, కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి. రేవణ్ణ ఏదోఒక ప్రత్యేకత ఉంటుంది. గతంలో చేతిలో నిమ్మకాయలు పెట్టుకుని కర్ణాటక అసెంబ్లీ (విధాన సౌధ)లోకి వెళ్లిన హెచ్.డి. రేవణ్ణ అప్పట్లో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు.

ప్రెస్ మీట్...... టేబుల్ మీద రూ. 10 లక్షల క్యాష్
ఇప్పుడు మరోసారి కర్ణాటక మాజీ మంత్రి, జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యే హెచ్ డీ. రేవణ్ణ హాట్ టాపిక్ అయ్యారు. శుక్రవారం హాసన్ లో హెచ్.డీ. రేవణ్ణ మీడియా మిత్రులు అందర్ని ప్రెస్ మీట్ కు పిలిచారు. ప్రెస్ మీట్ కు వెళ్లిన మీడియా మిత్రులు అందరూ కుర్చున్నారు. మీడియా సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే శివలింగేగౌడతో కలిసి వచ్చిన హెచ్.డీ. రేవణ్ణ ఒక్కసారిగా రూ. 10 లక్షల నోట్ల కట్టలు తీసి టేబుల్ మీద పెట్టడంతో అందరూ షాక్ అయ్యారు.

సీఎం పీఏ ఏమనుకుంటున్నాడు ?
సార్ అంత డబ్బులు టేబుల్ మీద ఎందుకు పెట్టారు ? అని మీడియా మిత్రులు ప్రశ్నించారు. అంతవరకు ప్రశాంతంగా ఉన్న హెచ్.డీ. రేవణ్ణ ఒక్కసారిగా కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప రాజకీయ కార్యదర్శి ( పీఏ) సంతోష్ మీద విరుచుకుపడ్డారు. మా పార్టీ (జేడీఎస్ పార్టీ) నాయకులను కొనుగోలు చెయ్యడానికి సీఎం బీఎస్. యడియూరప్ప పీఏ సంతోష్ ఈ డబ్బులు ఎరగా ఉపయోగించాడని మాజీ మంత్రి హెచ్.డి. రేవణ్ణ ఆరోపించారు.

నగరసభ సభ్యులు
హాసన్ జిల్లా అరసికెరె నగర సభ (మేజర్ మునిసిపాలిటి) సభ్యులు బీజేపీలో చేరడానికి సీఎం పీఏ సంతోష్ రూ. 10 లక్షలు ఇచ్చాడని, మా మాటవినకుండా జేడీఎస్ పార్టీలోనే ఉంటే మీ అంతుచూస్తామని, రాష్ట్రంలో. కేంద్రంలో మేమే అధికారంలో ఉన్నామని సంతోష్ మా సభ్యులను బెదిరిస్తున్నాడని మాజీ మంత్రి హెచ్.డి. రేవణ్ణ ఆరోపించారు.

సీబీఐ విచారణ చెయ్యాలి
ఎన్నికల్లో అరసికెరె నగరసభలో జేడీఎస్ పార్టీ విజయం సాధించి అధికారం చేపట్టిందని, 7 మంది మా పార్టీ సభ్యులకు రూ. 10 లక్షల చొప్పున ఇచ్చి బీజేపీలోకి చేర్చుకున్నారని మాజీ మంత్రి హెచ్.డీ. రేవణ్ణ. స్థానిక శాసన సభ్యుడు శివలింగేగౌడ ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచిన మా పార్టీ ప్రజాప్రతినిధులను కొనుగోలు చెయ్యడానికి ప్రయత్నించిన సంతోష్ మీద కేసు నమోదు చేసి సీబీఐతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి హెచ్.డి. రేవణ్ణ డిమాండ్ చేశారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications