సీఎం సిద్ధరామయ్య బుక్ అయ్యారే..!
ముడా కేసుకు సంబంధించి కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించి పోలీస్ విచారణ సాగుతోంది. తాజాగా ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక నిర్ణయం తీసుకుంది. ముడా కేసుకు సంబంధించి కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై కేసు నమోదు చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రకటించింది. సిద్ధరామయ్యతో పాటూ ఆయన భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామిల మీ కూడా ఈడీ కేసు నమోదైంది.
కర్ణాటకలోకి సీబీఐ రావడాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడంతో ఈడీ రంగంలోకి దిగింది. దీంతో వెంటనే ఈ కేసులో ఆయన్ను నిందితుడిగా చేరుస్తూ కేసు నమోదు చేయడం జరిగింది. డెవలప్‌మెంట్ అథారిటీ-ముడా భూముల వ్యవహారానికి సంబంధించి భారీగా డబ్బులు చేతులు మారాయని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి.. సిద్ధరామయ్యపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.ఇప్పటికే సెప్టెంబర్ 27వ తేదీన ముడా కుంభకోణం కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన లోకాయుక్త.. ఏ1గా సీఎం సిద్ధరామయ్య పేరును, ఏ2గా ఆయన భార్య పార్వతి, ఏ3గా ఆయన బావమరిది మల్లికార్జున్ పేర్లను చేర్చింది.

అంతేకాదు.. సీఎంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు జరిపేందుకు ఇప్పటికే గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ సైతం అనుమతిని ఇవ్వడం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేగింది. దీంతో సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్ తనపై విచారణకు పర్మిషన్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్ వేశాడు. అయితే దీనిపై మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ క్రమంలోనే స్పెషల్ కోర్టు ముడా కుంభకోణంలో సిద్ధరామయ్య, తన భార్యతో పాటు ఇతరులపై విచారణ చేయాలని పోలీసులకు ఆదేశించింది.ఊహించని పరిణామంతో సీఎం సిద్ధరామయ్య ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అయితే సీఎం సిద్ధరామయ్యపై మనీలాండరింగ్ కేసు నమోదు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పు పట్టింది. ఈ చర్యను కక్ష్య సాధింపుగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించుకుంది. సీబీఐ, ఈడీలను రంగంలోకి దించి ప్రభుత్వాలను తమ చేతుల్లోకి తీసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications