బ్యాంకుల నుండి డబ్బు దొంగతనం చేస్తే... ఆర్ధిక సంక్షోభం నుండి బయటపడతారా..? రాహుల్ గాంధీ

దేశంలో ఆర్ధిక సంక్షోభాన్ని నివారించడానకి కేంద్రానికి నిధులు ఇచ్చేందుకు ఆర్బీఐ అంగీకరించిన నేపథ్యంలోనే మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫైర్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఆర్ధిక సంక్షోభం పేరు మీద కేంద్రం బ్యాంకులను కొల్లగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. దీంతోపాటు ఆర్బీఐ నుండి డబ్బులు దొంగిలించారని ఆయన ధ్వజమెత్తారు. ఆర్బిఐ నుండి డబ్బులు దొంగిలించినంత మాత్రన ఆర్ధిక సంక్షోభాన్ని గాడిలో పెట్టలేరని ఆయన విమర్శలు గుప్పించారు.

మరోవైపు ప్రధానమంత్రితో పాటు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆర్ధిక సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదని విమర్శించారు. ఇలా బ్యాంకులను కొల్లగొట్టడం అంటే తుపాకి గాయానికి బ్యాండెడ్ వేయడం లాంటీదని అన్నారు. దీంతో పాటు ఆర్బీఐకి లూటెడ్ అనే హష్ ట్యాగ్ కూడ ఇచ్చారు.గత కొద్ది రోజులుగా నిధుల బదీలీకి సంబంధించి ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్‌కు ప్రధాని మోడీ ప్రభుత్వానికి మధ్య విభేధాలు తలెత్తిన విషయం తెలిసిందే, ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా కూడ చేశారు.

 money Stealing from RBI won’t work :Rahul Gandhi

ఊర్జిత్ పటేల్ రాజీనామాతో ప్రస్థుత గవర్నర్ శక్తికాంత దాస్ నిధుల బదీలీ కోసం చర్యలు చేపట్టాడు. దీంతో ఆర్బీఐ బోర్డు నిధుల కోసం ఓ కమిటీని వేసింది. కమిటీ సిఫారుసుల మేరకు రూ. లక్ష 76వేల కోట్లు ఆర్బీఐ నుండి కేంద్రానికి బదీలీకి పంచ జెండా ఊపింది. కాగా ఆర్ధిక మాంద్యం తలెత్తిన నేపథ్యంలో మరిన్ని పోత్సాహాకాలు కల్పించేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+