మాన్సూన్ అప్‌డేట్: సిక్కిం, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు
న్యూఢిల్లీ: దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ బలహీన రుతుపవనాలు కొనసాగుతున్నాయి. ఎంజేవో కదలికలు, ఉత్తర బంగాళాఖాతంలోని వాతావరణ పరిస్థితులను బట్టి జూన్ 24వ తేదీ నుంచి పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, చత్తిస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాలు, ఒడిశా తదితర ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించనున్నాయి. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. నైరుతి రుతుపవనాలు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలు, మిగిలిన సెంట్రల్ అరేబియన్ సముద్రంలో విస్తరించనున్నాయి. వల్సాద్, మాలెగావ్, అమరావతి, గోండియా, తిత్లాఘర్, కటక్, మిడ్నాపూర్, గోల్పారా, బాగ్డోగ్రాల మీదుగా నార్తర్న్ లిమిట్ ఆప్ మాన్సూన్స్ విస్తరించనున్నాయి.

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, మిగిలిన మహారాష్ట్ర, అసోం, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలు, చత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, దక్షిణ సౌరాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్‌లలో రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముంది.

కాగా, నైరుతీ రుతుపవనాలు మే 29వ తేదీన కేరళను తాకాయి. సాధారణం కంటే మూడు రోజులు ముందు వచ్చాయి. భారీ వర్షాల కారణంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ మాన్సూన్‌లో సెంట్రల్ ఇండియా సాధారణ వర్షపాతాన్ని, దక్షిణాది ప్రాంతంలోని కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుందని అంచనా. ఉత్తర-తూర్పు భారతదేశంలో కూడా సాధారణ వర్షపాతం నమోదు కానుంది.
దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ) 90శాతం-96శాతం ఉంటే సాధారణం కంటే తక్కువ అని, 96-104శాతం ఉంటే సాధారణం అని పరిగణిస్తారు. 90శాతం కంటే తక్కువగా ఉంటే తక్కువ వర్షపాతంగా తీసుకుంటారు. 104-110శాతం ఉంటే సాధారణం కంటే ఎక్కువ, 110శాతం కంటే ఎక్కువగా ఉంటే అత్యధిక వర్షపాతంగా తీసుకుంటారు.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!











Click it and Unblock the Notifications