వెదర్ రిపోర్ట్: కల్లోలంగా అరేబియా సముద్రం, భారీ వర్షాలు, మత్స్యకారులకు హెచ్చరిక
న్యూఢిల్లీ: అరేబియా సముద్ర తీర ప్రాంతాల్లో రానున్న 3-4రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. దేశం మొత్తం నైరుతి పవనాలు వ్యాపించి ఉన్నందున ఇతర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఛత్తీస్‌గఢ్, మధ్య భారతదేశం, నార్త్ పెనిన్సూలర్ ప్రాంతాల్లో వచ్చే మూడు నాలుగు రోజుల్లో వర్షాలు భారీగా కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.

అమృత్‌సర్, ఛండీగఢ్, షాహజాన్‌పూర్, గోరఖ్‌పూర్, నవడా, బంకురా, దిఘా, తూర్పు, దక్షిణ ప్రాంతాలు, బంగాళాఖాతం తీర ప్రాంతాల్లో జులై 6 నుంచే వర్షాలు మళ్లీ ప్రారంభమయ్యాయని తెలిపింది.
అరేబియా సముద్రంలో కొంత కల్లోల వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. రానున్న మూడు నాలుగు రోజులు ఇదే వాతావరణం ఉండనున్న క్రమంలో మత్స్యకారులు సముద్రంపై వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.

గోవా తీరంలో శని, ఆదివారాల్లో సముద్రంపై వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు జులై 6నే హెచ్చరికలు జారీ చేసింది. గురువారం రాత్రి నుంచే గోవాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా గోవాలో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి, రోడ్లన్నీ జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం సాధారణ వర్షపాతం నమోదైంది.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications