కేబుల్ బ్రిడ్జి విషాదం.. 60 మందిని కాపాడిన యువకుడు
గుజరాత్ మోర్బీలో తీగల వంతెన కూలిన విషాద సంఘటనలో ఇప్పటివరకు 135 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో నయీం షేక్ అనే యువకుడు తన స్నేహితుల సహాయంతో దాదాపు 60 మందిని రక్షించాడు. వారిని రక్షించే క్రమంలో అతను యపడటంతో మోర్బీలోని సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో నయీం కూడా తన స్నేహితుణ్ని కోల్పోయాడు.
వంతెన కూలిపోయే సమీపంలో తన స్నేహితులు ఐదుగురితో కలిసి నయీం షేక్ అక్కడే ఉన్నాడు. అతనికి ఈత రావడంతో స్నేహితులతో కలిసి 60 మందిని రక్షించాడు. అప్పుడు పరిస్థితి హృదయవిదారకంగా ఉందని, స్నేహితులు కూడా ఉండటంతో ఎంతమందిని వీలైతే అంతమందిని రక్షించాలనుకున్నట్లు వెల్లడించారు. కూలిపోయే సమయంలో దాదాపు 500 మంది ఉన్నారని ప్రాణాలతో బయటపడిన మరో వ్యక్తి తెలిపాడు.

తాను కూడా ఒక గంట నీటిలోనే ఉన్నానన్నాడు. వంతెనను పునరుద్ధరించే పనులు చేపట్టిన ఒరేవా, టికెట్ అమ్మకందారులు, భద్రతా సిబ్బంది కలిపి మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. దీన్ని క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి తెలిపారు. దుర్ఘటనపై విచారణ జరిపేందుకు గుజరాత్ ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. 8 నెలల నుంచి మూసివున్న వంతెనను ఇటీవలే పునరుద్ధరించి తెరిచారు.
మోర్బీ దుర్ఘటనలో మృతిచెందిన వ్యక్తుల కోసం నవంబర్ 2న గుజరాత్‌లో సంతాప దినం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన గాంధీనగర్ రాజ్‌భవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ భవనాలపై జాతీయ జెండాను సగానికి ఎగురవేయనున్నారు












Click it and Unblock the Notifications