ఆలయంలో భారీ పేలుడు- 157 మందికి తీవ్ర గాయాలు
Kerala Temple: కేరళలోని ప్రఖ్యాత నీలేశ్వరం ఆలయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 157 మంది భక్తులు గాయపడ్డారు. వారిలో ఎనిమిది మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. థెయ్యం ఉత్సవం ప్రారంభోత్సవం సందర్భంగా స్థానికులు ఆలయ ప్రాంగణంలో భారీగా బాణాసంచా పేల్చిన సమయంలో ఈ ఘటన సంభవించింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక, రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడ్డ వారిని మరింత మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రులకు రెఫర్ చేశారు.

కాసర్‌గోడ్ జిల్లాలోని నీలేశ్వరంలో గల అంజుతాంబళం వీరార్కవు ఆలయం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన సంభవించింది. కేరళలో సంప్రదాయక థెయ్యం ఉత్సవం నేటి నుంచి ప్రారంభమైంది. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో వైభవంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు.
కేరళ ఉత్తర ప్రాంతంలో గల మలబార్ రీజియన్ పరిధిలోకి వచ్చే జిల్లాల్లో కాసర్‌గోడ్, కన్నూర్‌తో పాటు వాయనాడ్‌లోని కొన్ని ప్రాంతల్లో థెయ్యం ఉత్సవాలను దశలవారీగా నాలుగు నెలల పాటు వైభవోపేతంగా నిర్వహిస్తుంటారు. అక్కడి గ్రామీణ సంప్రదాయాల్లో ఈ ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
VIDEO | Kerala: Over 150 people were injured, including eight seriously, in a fireworks accident during a temple festival near Neeleswaram, #Kasargod, late on Monday. The injured have been taken to various hospitals in Kasargod, Kannur, and Mangaluru.#KeralaNews #Kerala… pic.twitter.com/jGcrSxi31i
— Press Trust of India (@PTI_News) October 29, 2024
ఈ నేపథ్యంలో అంజుతాంబళం వీరార్కవు ఆలయంలో థెయ్యం ఉత్సవాలను నిర్వహించారు. వాటిని చూడటానికి వందలాది మంది ఈ ఆలయానికి చేరుకున్నారు. 12 గంటల సమయంలో ఉత్సవాల ప్రారంభోత్సవానికి గుర్తుగా బాణాసంచా పేల్చారు. వాటి నిప్పు రవ్వలు ఎగిరిపడి ఒక్కసారిగా అవన్నీ పేలిపోయాయి.
పేలుడు శబ్దం కిలోమీటర్ దూరం వరకు వినిపించిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనలో మొత్తం 157 మంది గాయపడ్డారు. వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది. వారిని నీలేశ్వరం, కాసర్‌గోడ్, కన్హర్‌గోడ్, మంగళూరు ఆసుపత్రులకు తరలించారు.












Click it and Unblock the Notifications