కేరళలో భారీ వర్షాలు, వరదలు: ఒకే రిసార్టులో 60 మంది పర్యాటకులు, అమెరికా వార్నింగ్ !
మున్నార్: కేరళలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆ రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేరళలోని ప్రకృతి అందాలు వీక్షించడానికి వెళ్లిన పర్యాటకులు నానా తంటాలు పడుతున్నారు.
కేరళలోని మున్నార్ సమీపంలోని ఒక్క రిసార్టులోనే 60 మంది పర్యాటకులు చిక్కుకున్నారు. భారీ వర్షాల కారణంగా మున్నార్ సమీపంలోని రిసార్టు నాలుగు వైపులా వరదల్లో రోడ్లు కొట్టుకుపోవడంతో పర్యాటకులు రిసార్టు నుంచి బయటకు రాలేకపోతున్నారు.

మున్నార్ రిసార్టులో చిక్కుకున్న పర్యాటకుల్లో 20 మంది విదేశీయులు ఉన్నారని కేరళ ప్రభుత్వ అధికారులు అంటున్నారు. కేరళ పర్యటన కొంత కాలం వాయిదా వేసుకోవాలని, ఆ రాష్ట్రానికి ప్రస్తుతం ఎవ్వరూ వెళ్లకూడదని అమెరికా ఆదేశ ప్రజలకు సూచించింది.
కేరళ పర్యటనకు వెళ్లిన వారు, వర్షాలు పడుతున్న సమయంలో బయలుదేరిన వారు క్షేమంగా వారి గమ్యస్థానాలు చేరుకున్నారా ? ఎవరైనా గల్లంతు అయ్యారా ? అని కేరళ ప్రభుత్వం ఆరా తీస్తోంది. కేరళలోని పలు ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా కొట్టుకుపోవడంతో పలు గ్రామాల్లోని ప్రజలకు బయట వ్యక్తులతో సంబంధాలు తెగిపోయాయి.












Click it and Unblock the Notifications