స్విమ్‌సూట్‌తో మార్ఫింగ్: పింక్ బికినీలో మంత్రి, కేసు
పనాజీ: గోవా మంత్రి సుదిన్ దవళికర్ ఫోటోలను మార్ఫింగ్ చేసి ఫేస్‌బుక్‌లో పెట్టారు. సుదిన్ ఫోటోను పింక్ బికినీలో మార్ఫింగ్ చేసి పోస్టు చేశారు. ఈ ఫోటో కలకలం రేపింది. ఈ విషయం ప్రభుత్వానికి తెలియడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసును సైబర్ సెల్‌కు అప్పగించారు.
దాంతో, అమెరికాలో ఆ ఫోటోను పోస్టు చేసిన గోవాకు చెందిన సవియో అల్మెడా అనే వ్యక్తిపై చర్యలు తీసుకోనున్నారు. సవియో పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు గోవా పోలీసులు తెలిపారు.

కాగా, గోవా బీచుల్లో ఇక నుంచి బికినీలను బ్యాన్ చేయాలని కొన్ని రోజుల కిందట మంత్రి సుదిన్ దవళికర్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అతను మార్ఫింగ్‌కు పాల్పడినట్టు తెలుస్తోంది.
అమ్మాయిలు కురచ దుస్తులతో పబ్‌లకు వెళ్లకూడదని, గోవాలోని సముద్ర తీరాలలోకి యువతులు బికినీ దుస్తులలో రాకుండా నిషేధించాలని గోవా మంత్రి సుదిన్ దవళికర్ కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించారు. ప్రభుత్వ స్థలాల్లో బికీనిలలో యువతులను అనుమతిస్తున్న కారణంగా ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వారిని అదుపు చేయడం చాలా కష్టంగా ఉందన్నారు. ఒక్కో సమయంలో ఎవరైనా బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంలో ఆలస్యమవుతోందని చెప్పారు.












Click it and Unblock the Notifications