వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వారియర్లకు ‘చిప్స్’ పంపిణీ చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా బాధితులకు, వారియర్లకు పలు ఎన్జీవోలు, సంస్థలు తమ వంతుగా సేవలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కూడా కరోనా వారియర్లకు పెద్ద మొత్తంలో చిప్స్ ప్యాకేట్లను పంపిణీ చేశారు.

భారతీయ జనతా పార్టీ ఢిల్లీ విభాగానికి ఈ చిప్స్ అందజేశారు. ఢిల్లీ బీజేపీ అధినేత ఆదేశ్ కుమార్ గుప్తా వీటిని తీసుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు, పోలీసు అధికారులకు ఆహార పదార్థాలను అందించడంతోపాటు ఇతర సహాయ, సహకారాలను బీజేపీ ఢిల్లీ విభాగం అందిస్తోందని ఆదేశ్ గుప్తా తెలిపారు.

MoS Kishan Reddy donates ‘chips’ to be distributed among Covid Warriors

మహమ్మారి కారణంగా కరోనా సోకిన బాధిత కుటుంబాలు కూడా తీవ్ర ప్రభావానికి లోనయ్యాయి. లాక్‌డౌన్ కారణంగా చాలా కుటుంబాలు రెండు మూడు రోజుల నుంచి ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నాయి. ఇది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలు అలాంటి కుటుంబాలకు ఆహార పదార్థాలను అందజేస్తున్నాయని చెప్పారు.

మరోవైపు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేళ్లైన సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. మే 30న పార్టీ పాలిత రాష్ట్రాల్లో కరోనా కారణంగా అనాథలైన పిల్లలకు ఆహారపదార్థాలు అందజేయాలని పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి కారణంగా ఎలాంటి వేడుకలు నిర్వహించవద్దని బీజేపీ పాలిత ముఖ్యమంత్రులకు ఆయన లేఖలు రాశారు.

English summary
While many NGOs, organisations and volunteers have come forward to help those in need by providing food, Union Minister of State for Home Affairs, G Kishan Reddy also donated “chips” as relief material to be distributed among the Covid Warriors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X