దారుణం: తల్లీకూతుళ్ల బట్టలిప్పి,అర్ధనగ్నంగా ఊరేగింపు
లక్నో: అనుమతి లేకుండా తన పొలంలోకి అడుగు పెట్టారనే కారణంతో దళిత వర్గానికి చెందిన తల్లీకూతుళ్లపై అగ్రకులానికి చెందిన ఓ ఆసామి విరుచుకుపడ్డాడు. దుస్తులు చించి, చితకబాది వారిని గ్రామంలో ఊరేగించాడు. ఈ దారుణ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ జిల్లాకు చెందిన దలుహెరా గ్రామంలో గురువారం ఈ సంఘటన జరిగింది. పొలంలో ఆ తల్లీకూతుళ్లు గడ్డి కోస్తున్నారని తెలియగానే, యజమాని క్షణంలో అక్కడికి చేరుకుని వారిపై చేయిచేసుకున్నాడు.

ఆ తర్వాత గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశాడు. వారు మహిళను, ఆమె కూతురును రప్పించారు. ఆ యజమాని వారిని కనికరం లేకుండా తోసేశాడు. వారి బట్టలు విప్పి, అర్ధనగ్నంగా అందరి ముందు వారిని ఉంచాడు. కాగా, ఈ గ్రామంలో ఈ ఇరు వర్గాల మధ్య మంచి సంబంధాలు లేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications