Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రూ. 80 లక్షలకు ఆప్ టికెట్! ఎంసీడీ పోల్స్ స్టింగ్ వీడియో అంటూ బీజేపీ సంచలనం

న్యూఢిల్లీ: తర్వలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) ఎన్నికల జరగనున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ సోమవారం అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన సంచలన స్టింగ్ వీడియో విడుదల చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ టికెట్‌ను ఆ పార్టీ రూ. 80 లక్షలు విక్రయిస్తున్నట్లు వీడియోలో ఉందని బీజేపీ పేర్కొంది.

బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఈ వీడియోపై మాట్లాడుతూ.. ఈ వీడియో అన్ని స్టింగ్స్‌కు తల్లిలాంటిదని వ్యాఖ్యానించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అవినీతిని బయటపెట్టాలంటూ పిలుపునిస్తుంటారు.. ఇప్పుడు ఆ పార్టీ నేత బిందు ద్వారా ఆప్ మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లను అమ్ముకుంటోందని విమర్శించారు.

Mother of all stings: BJP releases ‘sting videos’, alleges AAP sold tickets for MCD polls, kejriwal responds

ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్, చట్ట సభ్యుడు సౌరభ్ భరద్వాజ్ పేర్లు కూడా ఈ వీడియోలో ఉండటంతో సమగ్ర దర్యాప్తు జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

కాగా, ఆ వీడియోలో రోహిణి నుంచి పోటీ చేసేందుకు తాను అడిగినంత మొత్తం ఇస్తానని ఆప్ మాజీ సభ్యురాలు బిందు చెబుతోంది. రోహిణి అసెంబ్లీ ఆప్ ఇంచార్జ్ పునీత్ గోయల్ తో ఆమె దీనిపై చర్చలు జరుపుతుంది. ఎలా చెల్లింపు చేయాలని అడుగుతుంది. మరో వీడియోలో ఆప్ నార్త్ వెస్ట్ ఢిల్లీ లోక్‌సభ ఇంఛార్జ్ ఆర్ఆర్ పఠానియాతో చర్చించారని సంబిత్ పాత్ర తెలిపారు.

110 టికెట్లను ఆప్ భారీ మొత్తానికి అమ్మే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఎంసీడీ టికెట్లే కాదు.. అసెంబ్లీ సీట్లను కూడా ఆప్ అమ్ముకుంటోందని మరో బీజేపీ నేత విజేంద్ర గుప్తా ఆరోపించారు. మరోవైపు, ధనవంతులకే ఆప్ టికెట్లను విక్రయిస్తోందని బిందు కూడా ఆరోపించారు. పార్టీ కోసం పనిచేసినవారికి టికెట్ల ఇవ్వడం లేదని మండిపడ్డారు.

అయితే, బీజేపీ ఆరోపణలపై అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. బీజేపీ మరో జిమ్మిక్కు చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ మొదట లిక్కర్ స్కాం అన్నారు కానీ, దానిలో ఏది బయటపడలేదని అన్నారు. ఆ తర్వాత బస్ స్కాం, రోడ్ స్కాం, ఇప్పుడు టికెట్ స్కాం అంటున్నారని చెప్పారు. విచారణలో మాత్రం ఎలాంటి తప్పు బయటపడలేదని అన్నారు. కాగా,
డిసెంబర్ 4న ఎంసీడీ ఎన్నికలు జరగనున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+