కన్న తల్లి ఇలానా?: ముగ్గురు పిల్లలను బావిలో పడేసింది

Subscribe to Oneindia Telugu

భువనేశ్వర్: ఏ తల్లీ చేయని దారుణానికి ఒడిగట్టింది ఓ మహిళ. తన సంతాన్ని ఏ తల్లి అయినా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. కానీ, ఇక్కడ మాత్రం తన ముగ్గురు సంతానాన్ని ఓ లోతైన బావిలో పడేసి దారుణంగా చంపేసింది. ఈ ఘటన ఒరిస్సా రాష్ట్రం నౌపాద జిల్లాలోని కేశరాజ్‌పూర్‌లో చోటు చేసుకుంది.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కళ్యాణ్ సింగ్ మాఝీ, లొచ్చాని మాఝీ దంపతులకు ముగ్గురు సంతానం. కాగా, లొచ్చాని మాఝీ గత గురువారం స్థానికంగా ఉన్న ఓ బావి వద్ద ఏడుస్తూ గ్రామస్తులకు కనిపించింది. దీంతో అక్కడకు చేరుకున్న గ్రామస్తులు ఏం జరిగిందని ఆమెను ప్రశ్నించారు.

దీంతో బావిలో చనిపోయి ఉన్న తన ముగ్గురు సంతానాన్ని చూపించింది లొచ్చాని. వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల సహాయంతో కొందరు గ్రామస్తులు చనిపోయిన ముగ్గురు చిన్నారుల(ఇద్దరు మగ పిల్లలు, ఒక అమ్మాయి) మృతదేహాలను బయటికి తీసుకొచ్చారు.

Mother throws 3 kids into deep well, arrested

చనిపోయిన చిన్నారులను శశిభూషణ్(4), 18నెలల లక్ష్మణ్ మాఝీగా గుర్తించారు. ఘటనపై పోలీసులు లొచ్చానీని విచారించగా అసలు విషయం చెప్పింది. తానే తన పిల్లలను బావిలో పడేసి చంపినట్లు అంగీకరించింది. లొచ్చాని ఈ దారుణానికి పాల్పడిన సమయంలో ఇంట్లో ఉన్నాడని గ్రామస్తులు తెలిపారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. లొచ్చానిని అరెస్ట్ చేశారు. అయితే, చిన్నారులను వారి తల్లి లొచ్చాని ఎందుకు చంపిందనే విషయం మాత్రం తెలియరాలేదు. తన భర్తతో ఏదైనా గొడవ జరిగి ఈ దారుణానికి ఒడిగట్టిందా? లేక ఆమె మానసిక పరిస్థితి బాగోలేకనే అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 35-year-old woman hailing from Kesharajpur under Boden police limits in Odisha’s Nuapada district on Thursday killed her three children – all below five years of age, by throwing them into a deep well.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి