ఆరో అంతస్థు నుంచి పాపను కిందికి పడేసిన తల్లి
ముంబై: అప్పుడే పుట్టిన శిశువు భవనం ఆరో అంతస్థు నుంచి కింద పడిపోయి ప్రాణాలు విడిచింది. తల్లి ఆ భవనంలో పని మనిషిగా ఉంటోంది. బిడ్డను తల్లే కిందికి విసిరేసినట్లు అనుమానిస్తున్నారు. 20 ఏళ్ల పడిలో ఉన్న ఆ మహిళలకు పెళ్లి కాలేదని పోలీసులు తెలిపారు.
ఆ సంఘటన ముంబైలోని వెర్సోవా శివారులో శనివారం నాడు జరిగింది. డెలివరీ తర్వాత రెండు రోజుల పాటు ఆపార్టుమెంటులో ఉంటానని మహిళ తన యజమానులకు చెప్పింది. యజమానులు తమ ముంబైలోని మరో అపార్టుమెంటులో ప్రధానంగా నివాసం ఉంటారు. దాంతో ఆమె ఒక్కతే ఫ్లాట్‌లో ఉంది.

మహిళపై పోలీసులు హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. అయితే, రక్తస్రావం అవుతుండడంతో మహిళను పోలీసులు ఆస్పత్రిలో చేర్చారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనకు కారణం ఏమై ఉంటుందనే కోణంలో వారు దర్యాప్తు సాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications