తల్లా పిశాచా... హోం వర్క్ చెయ్యలేదని ఐదేళ్ళ బాలికను ఏం చేసిందో చూడండి!

హోంవర్క్ చేయలేదని ఐదేళ్ల బాలికను తాడుతో కట్టేసి, ఎర్రటి ఎండలో మేడ పైన పడేసిన అమానుష ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. నవమాసాలు మోసి, కని, పెంచుతున్న బిడ్డ పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఆ తల్లి తీరు అందరికీ విస్మయాన్ని కలిగించింది. ఇక ఈ ఘటన వివరాల్లోకి వెళితే

హోం వర్క్ చెయ్యలేదని బాలికపై తల్లి అమానుషం

హోం వర్క్ చెయ్యలేదని బాలికపై తల్లి అమానుషం

ఈశాన్య ఢిల్లీలోని ఖజూరి ఖాస్ ప్రాంతంలో 5 ఏళ్ల ఒకటవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఇంటికి వెళ్ళిన తర్వాత హోంవర్క్ చేయలేదని తల్లి ఆగ్రహించింది. దీంతో బాలిక కాళ్ళు, చేతులూ తాడుతో కట్టివేసి, ఇంటి టెర్రస్‌పై వదిలేసింది. ఎర్రటి ఎండలో శరీరం కాలుతుంటే బాలిక హాహాకారాలు చేసినప్పటికీ తల్లి పట్టించుకోలేదని తెలుస్తుంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది.

కాళ్లు చేతులు కట్టేసి ఐదేళ్ళ బిడ్డను భవనం టెర్రస్ పైన పడేసిన కసాయి తల్లి

కాళ్లు చేతులు కట్టేసి ఐదేళ్ళ బిడ్డను భవనం టెర్రస్ పైన పడేసిన కసాయి తల్లి

తల్లి బిడ్డను కాళ్లు చేతులు కట్టేసి భవనం టెర్రస్ పైన పడేసి వెళ్లిన ఘటనను పొరుగువారు చిత్రీకరించినట్లు తెలుస్తుంది. ఇక ఈ వీడియోలో, మైనర్ బాలిక తాడుతో కట్టి వేయబడి ఉంది, ఎండలో కాలుతున్న టెర్రస్‌పై బాలిక నొప్పితో మెలికలు తిరుగుతూ కనిపించింది. నొప్పి తట్టుకోలేక ఏడుస్తున్న బాలిక వీడియో బుధవారం వెలుగులోకి రావడంతో, వీడియో క్లిప్‌తో లభించిన సమాచారం ఆధారంగా ప్రాథమిక విచారణలో ఈ సంఘటన కరవాల్ నగర్‌లో జరిగినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఈశాన్య ఢిల్లీ) సంజయ్ కుమార్ సైన్ తెలిపారు.

ఖజూరి ఖాస్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

అయితే, వీడియోలో చూపబడిన ఇంటి చిరునామా ఖజూరి ఖాస్ ప్రాంతంలో ఉన్నట్లు కనుగొనబడిందని డిసిపి తెలిపారు. ఈ ఘటన జూన్ 2న జరిగిందని, హోంవర్క్ చేయనందుకు తన కుమార్తెను శిక్షించానని బాలిక తల్లి పోలీసుల ఎదుట అంగీకరించిందని తెలుస్తుంది. ఇక ఈ అమానవీయ ఘటనపై జువైనల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 75 కింద ఖజూరి ఖాస్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది" అని పోలీసులు వెల్లడించారు.

భార్య చేసిన పనికి మందలించానని చెప్పిన తండ్రి

భార్య చేసిన పనికి మందలించానని చెప్పిన తండ్రి

అమ్మాయి తండ్రి, టైలర్ వృత్తిని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. జూన్ 2 న, అతను తన సైకిల్ రిపేర్ చేయించడానికి వెళ్లాడని మరియు అతని భార్య మరియు ఇద్దరు పిల్లలు 5 ఏళ్ల అమ్మాయి మరియు వారి 11 ఏళ్ల కుమారుడు ఇంట్లోనే ఉన్నారని పేర్కొన్నాడు. ఇంటి వద్ద నా భార్య మా కూతురికి ఇంత కఠినమైన శిక్ష విధించిందని, నేను ఇంటికి రావాలని మా నాన్న నుండి నాకు కాల్ వచ్చింది. కానీ ఇంటికి వెళ్లేసరికి తన తండ్రి బాలికను విడిపించాడని బాలిక తండ్రి పేర్కొన్నారు. దీంతో తాను తన భార్యపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా వెల్లడించారు. అయితే ఈ సంఘటనలు ఇంటి పక్కనే ఉండే మైనర్ బాలుడు వీడియో రికార్డ్ చేసినట్టుగా బాలిక తండ్రి పేర్కొన్నారు.

 సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహం,.. తల్లా పిశాచా .. అంటూ ఫైర్

సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహం,.. తల్లా పిశాచా .. అంటూ ఫైర్

ఈ ఘటన కు సంబంధించిన వీడియోపై సోషల్ మీడియా వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నెటిజన్లు ఒకరు ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ అస్థానా మరియు ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్‌లను కూడా ట్యాగ్ చేశారు. ఇలాంటి ఘటనను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందని వారంటున్నారు. ఇక సొంత బిడ్డ పైన ఇలాంటి దారుణానికి పాల్పడిన తల్లి, తల్లా పిశాచమా అని నెటిజన్లు మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+