బైక్‌పై అసభ్య భంగిమ: మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ జంటకు గోవా పోలీసులు జరిమానా

పనాజీ: మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ జంటకు గోవా పోలీసులు జరిమానా విధించారు. మోటారు సైకిల్‌పై ప్రయాణిస్తూ అసభ్య చేష్టలకు పాల్పడటంతో వారికి రూ. 1000 జరిమానా విధించినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

సమ్మర్ స్పెషల్‌గా గోవాకు వెళుతున్న ఈ జంట మండోవీ వంతెనపై అసభ్య భంగిమలో బైక్‌పై వెళుతుండగా, ఓ వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియా వెబ్‌సైట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ అసభ్య భంగిమపై సర్వత్రా విమర్శలు రావడంతో పాటు, కొద్ది క్షణాల్లోనే పోలీసులకు చేరిపోయింది.

MP Couple fined for 'indecent' driving in Goa

దీంతో రంగంలోకి దిగిన గోవా పోలీసులు బైక్ రిజిస్ట్రేషన్ ఆధారంగా దాని యజమానిని వాకబు చేసి, ఆ తర్వాత ఆ జంట నివసిస్తోన్న హోటల్ అడ్రస్ పోలీసులు కనుగొన్నారు. ఆ జంట గోవాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌‌లో బస చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి జరిమానా విధించినట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+