పద్దతి మార్చుకుంటే మీకే మంచింది, ఢిల్లీ డీల్ గురించి తెలుసుకో, డీకేఎస్ స్ట్రాంగ్ వార్నింగ్ !

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 135 సీట్లు కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎం కుర్చీ కోసం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఎన్ని రోజులు బెంగళూరు, ఢిల్లీలో పోటీపడ్డారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఐదు రోజుల పాటు నానా తిప్పలుపడి సిద్దరామయ్య, డీకే శివకుమార్ ను రాజీ చేసింది.

30 నెలలు సిద్దరామయ్య మరో 30 నెలలు డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉండటానికి కాంగ్రెస్ పార్టీ రాజీ సూత్రంతో ఇద్దరు నాయకులను రాజీ చేసింది. ఇష్టం లేకపోయిన ఉప ముఖ్యమంత్రి పదవిలో డీకే శివకుమార్ ఉన్నారని కర్ణాటకతో పాటు దేశంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికి తెలిసిందే.

mpdksuresh

మొదటి రెండున్నర సంవత్సరాలు సిద్దరామయ్య సీఎంగా, మరో రెండున్నర సంవత్సరాలు డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేస్తారని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మీడియా ముందు అధికారికంగా ప్రకటించింది. అయితే కర్ణాటక కేపీసీసీ ప్రచార సమితి అధ్యక్షుడు ఎంబీ. పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పాటు సిద్దరామయ్య ఉంటారని, అందులో ఎలాంటి అనుమానం లేదని బహిరంగంగా స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. గత రెండు రోజుల నుంచి సిద్దరామయ్య ఐదు సంవత్సరాలు సీఎంగా ఉంటారని ఎంబీ. పాటిల్ పదేపదే పాట పాడుతున్నారు. అంతే కాకుండా తన మాటలకు తాను కట్టుబడి ఉన్నానని ఎంబీ. పాటిల్ డీకే శివకుమార్ వర్గీయులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అనుచరులు మండిపడుతున్నారు.

mpdksuresh

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్న ఎంబీ. పాటిల్ ను విమర్శించడానికి అంతధైర్యంగా ఎవ్వరూ ముందుకురాలేదు, ఇక డీకే శివకుమార్ తమ్ముడు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ డీకే. సురేష్ రంగంలోకి దిగారు. ఎంబీ పాటిల్ కు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, ఎవరు ఎక్కడ ఉంటే వాళ్లకే మంచిది అని డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ ఎంబీ పాటిల్ కు వార్నింగ్ ఇచ్చారు.

ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ప్రమాణస్వీకారం చేశారు. అంతకు ముందు ఢిల్లీలో ఏం జరిగింది అనే విషయం గురించి కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలను అడిగి తెలుసుకో, పూర్తి సమాచారం తెలుసుకుని మాట్లాడు, ఏదో నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూ అంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డీకే సురేష్ ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఎంబీ, పాటిల్ కు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు.

dk-shivakumar-siddaramaiah

అయితే ఈ విషయంలో తొందపడి మాట్లాడకూడదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చాలా ఓపికగా ఉన్నారని తెలిసింది. మొత్తం మీద లింగాయత్ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడిన ఎంబీ, పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు అయోమయంలో పడిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+