బీజేపీలోకి ఎంఎస్ ధోనీ - బంపరాఫర్..!?

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా. సొంత రాష్ట్రం జార్ఖండ్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు అవుననే చెబుతున్నాయి. ధోనీ బీజేపీలో చేరుతారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. కానీ ధోనీ ఐపీఎల్ తో పాటుగా సినిమా నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టాడు. వీటితో పాటు సేంద్రియ వ్యవసాయం కూడా చేస్తుంటాడు. ఇప్పుడు జార్ఖండ్ బీజేపీ నేతలు ధోనీతో సమావేశం కావటంతో బీజేపీలో చేరటం పైన చర్చ మొదలైంది.

ధోనీతో బీజేపీ నేతలు : ఎంఎస్ ధోనీ బీజేపీలో చేరుతన్నారంటూ మరోసారి చర్చ తెర పైకి వచ్చిది. తాజాగా ధోనీ రాంచీలో బీజేపీ నేతలతో కలిసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జార్ఖండ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దీపక్ ప్రకాశ్, జార్ఖండ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ సీపీ సింగ్, కంకే ఎమ్మెల్యే సమ్రిలాల్ ఎంఎస్ ధోనీతో సమావేశమయ్యారు. దీంతో మరోసారి బీజేపీలో చేరుతున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. గతంలో ధోనీ 2011 లో ప్రపంచ కప్ గెలిచిన తరువాత బీజేపీలో చేరుతారని ప్రచారం సాగింది. ఆ తరువాత ఎన్నికల్లో రాంచీ నుంచి పోటీకి దిగేలా బీజేపీ నేతలు ఒప్పించారని ఆ పార్టీలో చర్చ సాగింది. ఆ తరువాత ధోనీ ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో చెన్నైలో ఒక ఈవెంట్ లో కలిసారు. ఆ సమయంలోనూ చర్చ జరిగింది.

MS Dhoni, had a meeting with some prominent BJP leaders in Ranchi leads to new Speculations

బీజేపీలోకి ఆహ్వానం : ఇక, ఐపీఎల్ లో సీఎక్కే కెప్టెన్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా నడిపిస్తున్న ధోని వచ్చే ఐపీఎల్ ఆడుతారా లేదా అనే సందేహం నెలకొంది. ఈ సమయంలో ధోనీ ఖచ్చితంగా ఆడుతారనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అయితే ధోనీ క్రికెట్ తో పాటుగా పలు వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు. మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సైతం బీజేపీ ఎంపీగా ఉన్నారు. మాజీ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాజా జడేజా బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీజేపీ దేశ వ్యాప్తంగా సెలబ్రెటీలు తమకు మద్దతుగా నిలవాలని కోరుతోంది. తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్, నితిన్, మైథిలీ రాజ్ వంటి వారితోనూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. సెలెబ్రెటీలు తమకు మద్దతుగా నిలుస్తున్నారని చెప్పటం ద్వారా పాజిటివ్ వేవ్ పెంచుకొనేందుకు ప్రయత్నాలు చేస్తుందనే అభిప్రాయం ఉంది.

ధోనీ సిద్దమేనా : అయితే, ధోనీకి మాత్రం దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ధోనీ పార్టీలో చేరితే లోక్ సభ సీటు కేటాయిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేకపోతే రాజ్యసభకు అయినా సిద్దమేనని ఆ రాష్ట్ర నేతలు ప్రతిపాదించినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో..అసలు ధోనీ రాజకీయాల్లో వస్తారా..వచ్చినా బీజేపీలో చేరుతారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం బీజేపీ నేతలతో ధోనీ ఫొటో మాత్రం అటు క్రికెట్ ..ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+