వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

9వసారి ముఖేష్ 'ధనవంతుడు', టాప్ 100లో ఫ్లిప్‌కార్ట్ బన్సాల్స్: టాప్ 10 వీరే..

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ వరుసగా తొమ్మిదో ఏడాది భారత అత్యంత ధనికవంతుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. 18.9 బిలియన్ డాలర్లతో ముఖేష్ ఈ ఏడాది కూడా అత్యంత భారత ధనవంతుడిగా నిలిచారు.

గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 4.7 బిలియన్ డాలర్లు తక్కువగా ఉంది. అయినప్పటికీ ముఖేష్ అంబానీయే తొలి స్థానంలో నిలిచారు.

అదే సమయంలో ఈ కామర్స్ బిజినెస్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు.. మొదటిసారి భారత దేశంలోని టాప్ 100 జాబితాలో చేరారు.

బుధవారం భారత అత్యంత ధనికుల జాబితాను విడుదల చేసింది. ఫోర్బ్స్ మేగజైన్ ప్రకారం... ముఖేష్ అంబానీ తొలి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత సన్ ఫార్మాకు చెందిన దిలీప్ సంఘ్వీ రెండో స్థానంలో ఉన్నారు. దిలీప్ సంఘ్వీ ఆస్తులు 18 బిలియన్ డాలర్లు.

Mukesh Ambani India's richest for 9th year; Flipkart's Bansals new entrants

విప్రో అజీం ప్రేమ్ జీ 15.9 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలిచారు. ఇక, ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్‌లు ధనికుల జాబితాలో తొలిసారి చోటు దక్కించుకున్నారు. వారు ఈ ఏడాది 86వ స్థానంలో నిలిచారు. ఇద్దరి వద్ద చెరో 1.3 బిలియన్ డాలర్ల నెట్ ఉంది.

2015లో అత్యంత సంపన్నుల జాబితాను ఫోర్బ్స్‌ పత్రిక బుధవారం విడుదల చేసిన జాబితా ప్రకారం... టాప్

టెన్‌లో వీరే...

1. ముఖేష్ అంబానీ - 18.9 బిలియన్‌ డాలర్ల (రూ.1.23 లక్షల కోట్ల). గతేడాది కంటే రూ.30,500 కోట్లుతగ్గింది. అందుకు ముడిచమురు ధరలు తగ్గడమే కారణమని తెలిపింది. మొదటి స్థానం
2. దిలీప్‌ సంఘ్వి (18 బిలియన్‌ డాలర్లు - రూ.1.17 లక్షల కోట్లు) - రెండో స్థానం
3. అజీమ్‌ ప్రేమ్‌జీ (15.9 బి.డాలర్లు - రూ.1.03 లక్షల కోట్లు) - మూడో స్థానం
4. హిందూజా సోదరులు (14.8 బి.డాలర్లు - రూ. 96,200 కోట్లు) - 4వ స్థానం
5. పల్లోంజీ మిస్త్రీ (14.7 బి.డాలర్లు - రూ.95,550 కోట్లు) - 5వ స్థానం
6. శివ్‌నాడార్‌ (12.9 బి.డాలర్లు - రూ. 83,850 కోట్లు) - 6వ స్థానం
7. గోద్రేజ్‌ కుటుంబం (11.4 బి.డాలర్లు - రూ. 74,100 కోట్లు) - 7వ స్థానం
8. లక్ష్మీ మిట్టల్‌ (11.2 బి.డాలర్లు - రూ. 72,800 కోట్లు) - 8వ స్థానం
9. సైరస్‌ పూనావాలా (7.9 బి.డాలర్లు - రూ. 51,350 కోట్లు)- 9వ స్థానం
10. కుమార బిర్లా (7.8 బి.డాలర్లు - రూ. 50,700 కోట్లు) - 10వ స్థానం

86.ఫ్లిప్‌కార్ట్‌ వ్యవస్థాపకులు సచిన్‌ బన్సల్‌, బన్నీ బన్సల్‌ చెరి (1.3 బి.డాలర్లు) రూ.8450 కోట్లు సంపదతో 86వ స్థానం పొందారు.

English summary
Industrialist Mukesh Ambani was on Wednesday named India's richest for ninth year in a row with a net worth of $18.9 billion even as his wealth dipped by $4.7 billion in a year, while ecommerce giant Flipkart's founders made their debut on the country's top 100 rich list.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X