హాట్&సెక్సీగా ఉన్నావు.. కోరిక తీర్చు: ఛాంబర్‌కు పిలిచి షాక్ ఇచ్చాడు..

Subscribe to Oneindia Telugu

ముంబై: పని ప్రదేశాల్లో మహిళల పట్ల లైంగిక వేధింపులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ముంబైలోని మల్టీ క్రోర్ డైమండ్ సంస్థలో పనిచేస్తున్న 19ఏళ్ల ఓ అమ్మాయికి కంపెనీ మేనేజర్ నుంచి వేధింపులు ఎదురయ్యాయి.

అగస్టు 1వ తేదీ, సాయంత్రం 5.45గం. సమయంలో సెక్యూరిటీ గార్డ్ వచ్చి మేనేజర్ పిలుస్తున్నట్లు ఆమెతో చెప్పాడు. అప్పటికే కంపెనీలోని స్టాఫ్ అంతా వెళ్లిపోగా.. సదరు యువతి మాత్రం ఓవర్ టైమ్ వర్క్ చేస్తోంది. సెక్యూరిటీ కబురు మేరకు మేనేజర్‌తో మాట్లాడేందుకు యువతి అతని ఛాంబర్‌కు వెళ్లింది.

Multi-crore diamond firm's production manager arrested for sexually harassing employee

గదిలోకి అడుగుపెట్టగానే.. ఎందుకు పిలిచారని యువతి మేనేజర్ ను అడిగింది. అంతా ముఖ్య విషయమేమి కాదంటూ యువతిని కింద నుంచి మీదికి ఎగాదిగా చూశాడు. ఒక్కసారిగా ఆమె దగ్గరికి వచ్చి చేయి పట్టుకున్నాడు. 'నీవు చాలా హాట్ అండ్ సెక్సీగా కనిపిస్తున్నావు.. నా కోరిక తీర్చితే నీవేది అడిగితే అది చేస్తా'అంటూ ఆమె పట్ల అసభ్యకరంగా వ్యవహరించాడు.

అంతేకాదు..'చూడటానికి నువ్వు బక్క పల్చగా కనిపిస్తున్నావు.. నేను నిన్ను ఆరోగ్యకరంగా మారుస్తా' అంటూ వెకిలి వ్యాఖ్యలు చేశాడు. విషయం బయటకు పొక్కితే ఉద్యోగం నుంచి పీకేస్తానని, తనకున్న పరిచయాలతో ముంబైలో మరెక్కడా జాబ్ రాకుండా చేస్తానని హెచ్చరించాడు.

మేనేజర్ ప్రవర్తనతో నిర్ఘాంతపోయిన యువతి.. విషయాన్ని హెచ్ఆర్ డిపార్ట్‌మెంటు వారికి చెప్పింది. వారి సలహా మేరకు మేనేజర్ మీద ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఎంఐడీసీ పోలీస్ స్టేషన్ పరిధిలో అతనిపై కేసు నమోదైంది. సెక్షన్ 354ఏ(1),509,506,కింద కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు. దీనిపై విచారణ కొనసాగుతోందని పోలీస్ అధికారులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
"You look hot and sexy. Sleep with me once and I will fulfil all your demands." These words were uttered by a production manager with a multi-crore diamond firm in Andheri to a 19-year-old computer operator at the company.
Please Wait while comments are loading...