ప్రియురాలికి రూ.2 కోట్లు, భార్యకు విడాకులు, ట్విస్టిచ్చిన లవర్...

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: తన ప్రియురాలు మరో వ్యక్తితో చనువుగా ఉంటుందనే అనుమానంతో బార్ డ్యాన్సర్‌ను అతికిరాతకంగా హత్య చేశాడు ప్రియుడు.ఈ ఘటన మహరాష్ట్రలోని ముంబై శివారులోని టింబా సమీపంలోని ఫామ్‌హౌజ్‌లో చోటు చేసుకొంది.

మహరాష్ట్రలోని సూరత్‌కు సమీపంలోని టింబా గ్రామానికి చెందిన ప్రీతేష్ పటేల్ తరచూ బార్లకు వెళ్ళేవాడు. అక్కడ నిషా జ్యోతితో పరిచయమైంది. అయితే ఈ పరిచయం ప్రేమకు దారి తీసింది.

వీరిద్దరూ ప్రేమించుకొంటున్నారు. తరచూ కలిసి తిరిగేవారు. తన ప్రియురాలి కోసం ప్రియుడు ప్రీతేష్ పటేల్ రూ.2 కోట్లను ఖర్చు చేశాడు. అయితే ప్రియురాలు మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని అనుమానించి హత్య చేశారు.

ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

ప్రీతేష్ పటేల్ బార్ డ్యాన్సర్ జ్యోతి అలియాస్ సూర్జిత్ సింగ్, అలియాస్ నిషాజ్యోతిని ప్రేమిస్తున్నాడు. డిసెంబర్ 27న ప్రీతేష్ పటేల్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఫామ్‌హౌజ్‌లో పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి నిషాజ్యోతి కూడ హజరైంది. మరునాడు కొత్త సంవత్సర వేడుకల్లో కూడ ఇద్దరు పాల్గొన్నారు.అయితే మరో యువకుడితో నిషాజ్యోతి సన్నిహితంగా ఉంటుందని భావించి బాధితురాలిని హత్య చేశాడు ప్రీతేష్ పటేల్.

భార్యకు విడాకులు

భార్యకు విడాకులు

నిషా జ్యోతి కోసం ప్రీతేష్ పటేల్ భార్యకు విడాకులు ఇచ్చాడు. నిషా జ్యోతి విషయమై భార్య,భర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. అయితే ఈ గొడవల కారణంగా ప్రీతేష్ పటేల్ భార్యకు కూడ విడాకులు ఇచ్చాడు. నిషా జ్యోతి కోసమే ప్రీతేష్ పటేల్ భార్యకు విడాకులు ఇచ్చారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ప్రియురాలు నిషాజ్యోతి కోసం రూ.2 కోట్ల ఖర్చు

ప్రియురాలు నిషాజ్యోతి కోసం రూ.2 కోట్ల ఖర్చు

నిషాజ్యోతి కోసం ప్రియుడు ప్రీతేష్ పటేల్ రూ.2 కోట్లు ఖర్చు చేసినట్టు ఆయన పోలీసులకు చెప్పాడు. తాను ఆమె కోసం ఇంత చేస్తున్నా తనను కాదని మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడంతోనే హత్య చేసినట్టు ప్రీతేష్ పటేల్ పోలీసులకు చెప్పారు

నిషాజ్యోతితో గొడవ హత్య

నిషాజ్యోతితో గొడవ హత్య

మరో యువకుడితో సన్నిహితంగా ఉంటున్న విషయమై నిషాజ్యోతితో ప్రీతేష్ పటేల్ మంగళవారంనాడు గొడవ పెట్టుకొన్నాడు. ఇద్దరి మధ్య గొడవ తీవ్రమైంది. ఆగ్రహం పట్టలేక నిషాజ్యోతిని ప్రీతేష్‌పటేల్ కొడవలితో నరికి చంపాడు. ఆ సమయంలో అక్కడే నిషాజ్యోతి డ్రైవర్ సందీప్ సింగ్, ఆయన భార్య కూడ అక్కడే ఉన్నారు. అయితే భయంతో వారు పారిపోయారు.వారిచ్చిన సమాచారంతో పోలీసులు ప్రీతేష్ పటేల్ ను అరెస్ట్ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A bar dancer and small-time model from Mumbai was brutally murdered by her boyfriend at a farm in Timba village near Kamrej on Tuesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి