ముంబైలో అగ్ని ప్రమాదం: నలుగురి మృతి, పలువురికి గాయాలు (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: ముంబైలో గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదం నుండి ఏడుగురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. వారం రోజుల లోపుగానే ముంబైలో రెండో సారి అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది

వాణిజ్య రాజధాని ముంబైలో గురువారం నాడు మరో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం వేకువ ఝామున చోటు చేసుకున్న ఈ ఘటనలో నలుగురు మృత్యువాత పడ్డారు.

మరోల్‌ చర్చ్‌ రోడ్‌లోని మైమూన్‌ అపార్ట్‌మెంట్‌లో అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఏడుగురిని రక్షించారు.. 45 నిమిషాల్లో మంటలను అదుపులోకి తెచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఘటనలో నలుగురు మరణించారని అధికారులు ప్రకటించారు.

కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.. దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. డిసెంబర్ 29న, కమలా మిల్స్‌ కాంపౌండ్‌ ఘటన తరహాలోనే ఇక్కడ కూడా ఊపిరి ఆడకనే బాధితులు ప్రాణాలు వదిలినట్లు అధికారులు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
At least four people were killed after a fire broke out on Wednesday night in a residential building in Mumbai’s Marol locality in Andheri suburb.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి