యువతిని గ్యాంగ్‌రేప్ చేసిన ఫేస్‌బుక్ ఫ్రెండ్స్

ముంబై: మహారాష్ట్రలోని థానేలో దారుణ ఘటన జరిగింది. సామాజిక వెబ్‌సైట్ అయిన ఫేస్‌బుక్ ద్వారా ఓ యువతిని పరిచయం చేసుకున్న ఓ యువకుడు.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అతని స్నేహితులు కూడా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. మూడు నెలల క్రితం ఓ 15ఏళ్ల యువతికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు ఓ యువకుడు. ఈ మూడు నెలల కాలంలో వీరి మధ్య స్నేహం చిగురించింది. అయితే సెప్టెంబర్ 30న తన బర్త్‌డే అని చెప్పి యువతిని ఇంటికి తీసుకొచ్చాడు.

స్నేహితుడే కదా అని నమ్మి వెళ్లిన ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ దుర్మార్గుడు. అంతేగాక, అక్కడేవున్న అతని మరో ఇద్దరు స్నేహితులు కూడా ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు.

Mumbai: Man Befriends 15-Year-Old on Facebook, Rapes Her at a Party

అనంతరం అక్కడ్నుంచి తప్పించుకున్న యువతి.. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. కానీ సమాజంలో పరువు పోతుందని విషయాన్ని బయటకు తెలియనివ్వలేదు. అయితే సోమవారం యువతికి కడుపు నొప్పి, తలనొప్పి రావడంతో వైద్య పరీక్షల నిమిత్తం యువతిని ఆస్పత్రికి తీసుకెళ్లగా విషయం వెలుగు చూసింది.

దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా కౌస్తుభ్ చవాన్(21), దీపాళి అహిర్(25), మందర్(30)ను నిందితులుగా పోలీసులు గుర్తించారు. సెప్టెంబర్ 30న జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మంగళవారం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+