మహిళా కానిస్టేబుల్‌పై వేధింపులు: కానిస్టేబుల్ అరెస్ట్

ఘటనపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు నిందితులైన పోలీస్ వాహనానికి డ్రైవర్‌గా పనిచేస్తున్న కానిస్టేబుల్ నవనీత్ ఖేడ్కే, ఇద్దరు వార్డ్ బాయ్‌లు మహేష్ బరియా(31), శంకర్ అంబవాలె (42)లపై కేసు నమోదు చేసిన పోలీసులు, శనివారం వారిని అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 6న జరిగిన ఈ సంఘటనపై బాధితురాలు ఆలస్యంగా ఫిర్యాదు చేసింది. వైద్యురాలి సహాయంతో ఉన్నతాధికారుల దగ్గరకు వెళ్లిన బాధితురాలు ఈ విషయంపై ఫిర్యాదు చేసింది.
ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల జరిగిన పోలీసు రిక్రూట్‌మెంట్‌లో కానిస్టేబుల్ ఉద్యోగానికి బాధితురాలు ఎంపికైంది. అయితే శిక్షణ తీసుకుంటున్న సమయంలో కాలు విరగడంతో ఆమె నాగ్పడ పోలీస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆస్పత్రిలో వార్డ్‌బాయ్‌లుగా పనిచేస్తున్న శంకర్ అంబవాలె, మహేష్ బరియా, పోలీస్ కానిస్టేబుల్ నవనీత్ ఖేడ్కేలు ఆమెకు పరిచయమ్యారు. ఖేడ్కే ఆమెకు తరచూ హోటల్ నుంచి ఆహారం తీసుకువస్తూ ఉండేవాడు. ఆ తర్వాత మొబైల్ ఫోన్లో ఆమెతో మాటలు సాగించాడు.
మొదట తనకు సహాయకంగా ఉన్నట్లు నటించిన ఖేడ్కే, బరియాలు ఆ తర్వాత వేధింపులకు పాల్పడటం మొదలుపెట్టారు. ఆ తర్వాత తనను ఔట్ పేషెంట్ గదికి తీసుకెళ్లి ఆరోగ్య విషయాలు మాట్లాడినట్లు నటించి తనపై లైంగిక వేధింపులకు పాల్పడేందుకు ప్రయత్నించారని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఆ సమయంలోనే వైద్యురాలు రావడంతో అక్కడి నుంచి తాను బయటపడ్డానని, అయితే ఈ విషయాన్ని బయటికి చెబితే చంపేస్తామని ఖేడ్కే బెదిరించాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.












Click it and Unblock the Notifications