భారీ వర్షాలకు బురదమట్టిలో కురుకుపోయిన నివాసాలు: 11 మంది దుర్మరణం..

ముంబై: ముంబైని భారీ వర్షాలు మరోసారి ముంచెత్తాయి. అర్ధరాత్రి నుంచి కురుస్తోన్న భారీ వర్షాల ధాటికి మళ్లీ నీట మునిగింది. కొన్ని గంటల పాటు కురిసిన కుండపోతతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు పోటెత్తింది. వర్షాలకు కొండచరియలు సైతం విరిగిపడుతున్నాయి. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక కార్యక్రమాలు చేపట్టారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ముంబై ఈశాన్య ప్రాంతంలోని చెంబూర్‌‌లో ఈ తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి నుంచి కురుస్తోన్న భారీ వర్షాల ధాటికి చెంబూర్‌ ప్రాంతంలోని కొండచరియలు విరిగి నివాసాల మీద పడుతోన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బృహన్‌ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు హెచ్చరించారు.

Mumbai rains: 11 people killed after a wall collapse in Chembur due to a landslide

కుండపోత వర్షాలకు తడిచి ముద్దయిన ప్రాంతాల్లో ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రావొద్దని అన్నారు. చెంబూర్‌ సహా చునాభట్టీ, సియోన్, దాదర్, గాంధీమార్కెట్, కుర్లా, మాతుంగ వంటి అనేక ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. వర్షాల తీవ్రతకు చెంబూర్‌లోని భరత్ నగర్ సమీపంలో కొండచరియలు విరిగి నివాసాల మీద పడ్డాయి. మట్టి, బురదలో ఆయా నివాసాలు కూరుకుపోయాయి. ఈ ఘటనలో 11 మంది దుర్మరణం పాలయ్యారు.

Mumbai rains: 11 people killed after a wall collapse in Chembur due to a landslide

శిథిలాల మధ్య పలువురు చిక్కుకునిపోయారు. 15 మంది వరకు గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక కార్యక్రమాలను చేపట్టారు. ఇళ్ల శిథిలాలను తొలగిస్తోన్నారు. గాయపడ్డ వారిని చెంబూర్ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని వెలికి తీస్తోన్నారు.

Mumbai rains: 11 people killed after a wall collapse in Chembur due to a landslide

Recommended Video

    Death Toll Climbs In Western Germany Flooding

    అంబులెన్సులు, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ వాహనాల రాకపోకలు చెంబూర్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా వైరస్ నుంచి కోలుకుంటోన్న దశలో ముంబైలో భారీ వర్షాలు సంభవించడం వల్ల ఈ మహమ్మారి మరోసారి విజృంభించే ప్రమాదం ఉందనే భయాందోళనలు వ్యక్తమౌతోన్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+