వరదలకు ముంబై అతలాకుతలం: కారణాలు ఏమిటంటే?
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు 288 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. దీంతో ప్రాణనష్టం పెద్దగా జరగకపోయినా, పౌర జీవితం అస్తవ్యస్తమైంది.
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు 288 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. దీంతో ప్రాణనష్టం పెద్దగా జరగకపోయినా, పౌర జీవితం అస్తవ్యస్తమైంది.
ఇందుకు పూర్తి బాధ్యత స్థానిక మున్సిపాలిటీ, పాలకులదే. పన్నెండేళ్ల క్రితం 2005లో జూలై 26న 24 గంటల్లో 944 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. దీంతో ముంబై చిగురుటాకులా వణికిపోయింది. అప్పుడు ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది.
పక్కనే సముద్రం, నైసర్గిక స్వరూపం కారణంగా ముంబై నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని పాలకులకు తెలిసిందే.

అందుకే ముంబై మున్సిపల్ కార్పోరేషన్ 1985లో బ్రిటిషన్ ప్రముఖ కన్సల్టెంట్ వాట్సన్ హక్షీని పిలిపించి గంటకు 50 మిల్లీ మీటర్ల వర్షం పడినా తట్టుకునేలా పటిష్టమైన నాలా వ్యవస్థకు ప్రణాళిక రూపొందించాలని కోరింది.
దానిని అప్పుడు బృహన్ ముంబై స్మార్ట్ వాటర్ డ్రెయినేజ్ రిపోర్టుగా పేర్కొన్నారు. అయితే అధికారులు సకాలంలో పని జరిగేలా చూడకపోవడంతో కన్సల్టెంట్ తన ప్రణాళికను రూపొందించి ఇచ్చేందుకు ఎనిమిదేళ్లు పట్టింది.
దానిని అరకొరగా అమలు చేయడానికి మున్సిపల్ పాలకులకు 12 ఏళ్లు పట్టింది. ఫలితంగా 2005లో నగరాన్ని వరదలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ రిటైర్డ్ ఇంజనీర్లతో స్థానిక మున్సిపాలిటీ ముంబై వికాస్ సమితిని ఏర్పాటు చేసింది.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగింటి వాటర్ డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపర్చేందుకు మరో ప్రణాళికను రూపొందించాలని ఆదేశించింది. ఆ సమితి ముంబైలో వర్షాలు పడే 121 ప్రాంతాలను గుర్తించింది. అందుకు అనుగుణంగా ప్రణాలిక రూపొందించింది.
దానిని అమలు చేసేందుకు రూ.616 కోట్లు ఖర్చువుతుందని అంచనా వేసింది. వాటిలో రూ.260 కోట్ల రూపాయలను మాత్రమే వెచ్చించి చిన్న చిన్న పనులనే స్థానిక పాలకులు అమలు చేశారు.
ఏటా రూ.30 వేల కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ ఉండే ముంబై మున్సిపల్ కార్పోరేషన్ వరద సహాయక చర్యల కింద రూ.200, రూ.300 కోట్లు ఖర్చు పెడుతుంది కానీ, వరద నివారణలకు ముందుగా ఖర్చు పెట్టడానికి మాత్రం ముందుకు రాదంటున్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications