వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబైలో భారీ వర్షాలు: ఇరుక్కుపోయిన వారికి ద్వారాలు తెరిచిన సిద్దివినాయక ఆలయం

|
Google Oneindia TeluguNews

ముంబై: ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే అక్కడ జనజీవనం స్తంభించిపోయింది . ఎటు చూసిన ప్రధాన రహదారులు నీటితో నిండిపోయి చెరువులను తలపిస్తున్నాయి. ఇప్పటికే ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలతో వాతావరణ కేంద్రం రెడ్‌ అలర్ట్ ప్రకటించింది. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.

ఇక భారీ వర్షాల కారణంగా రోడ్లపై నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ముంబైలోని ప్రముఖ సిద్ధి వినాయక ఆలయం ద్వారాలను తెరిచింది. ఇబ్బందులు పడుతున్న వారికి అక్కడే బస ఏర్పాటు చేసింది. అంతేకాదు రాత్రికి భోజన ఏర్పాట్లు కూడా చేసింది. దీంతో వర్షంలో ఇరుక్కుపోయిన ప్రజలు సిద్ధి వినాయక ఆలయంకు చేరుకున్నారు.

rains

ముంబయిలో మరోసారి ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుండి నగరంలో కుండపోత వర్షం కురుస్తుండంతో నగరమంతా రెడ్ అలర్ట్ ప్రకటించారు. అయితే ఇదే వర్షం మరో ఇరవై నాలుగు గంటల పాటు కురుస్తుందనే వాతవరణ శాఖ ప్రకటనతో రానున్న ఇరవై నాలుగు గంటలు రెండ్ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీంతో రానున్న రెండురోజుల పాటు స్కూళ్లకు సెలవు ప్రకటించారు.

గత 24 గంటలుగా మహారాష్ట్రలో ఎడతెరపిలేని వర్షం కురస్తోంది. దీంతో జనజీవనం స్థంబించి పోయింది.వాతవరణ శాఖ అంచనాల ప్రకారం మొత్తం 150 వాతవరణ సెంటర్లలలో 100 స్టేషనల్లో 200 మీమీ వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఈనేపథ్యలోంలో గత సెప్టెంబర్‌లో కురిసిన వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోదైనట్టు వాతవరణ శాఖ అధికారులు తెలిపారు. ఈనేపథ్యంలోనే ముంబయి నగర వీధులు పూర్తిగా జలయమం అయ్యాయి. దీంతో పలు స్కూళ్లకు సెలవును ప్రకటించారు. మరోవైపు ట్రాఫిక్ కూడ నెమ్మదిగా వెళుతున్నట్టు అధికారులు తెలిపారు. వర్షం సందర్భంగా పలు రైళ్లు, విమానాలు రద్దయ్యాయి.

English summary
Heavy rains in Mumbai have severally affected life in the city.The situation in Mumbai could likely worsen with the weather office predicting more rain for the region.Mumbai's famous Siddhivinayak temple has opened its gate for the rain-stranded people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X