వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వింత: కుక్కల పేరున రూ.5 కోట్ల ఆస్తి, కుక్కల సంక్షేమం కోసం ట్రస్టు ఏర్పాటు చేసిన జంట

కుక్కల పేరున రూ.5 కోట్ల ఆస్తి రాసివ్వాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ కుక్కలను తమ పిల్లల మాదిరిగానే చూసుకొంటున్నారు ఆ దంపతులు.అయితే తమకు పిల్లలు లేని లోటును కుక్కలు తీర్చాయని భావిస్తున్నారు ఆ దంపతులు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై:మానవత్వం మరుగున పడి పోతున్న ఈ కాలంలో కుక్కలను తమ వారసులుగా గుర్తించి వాటికి తమ ఆస్తిని రాసేందుకు ముందుకు వచ్చారు ముంబాయికి చెందిన దంపతులు.అయితే స్వంత పిల్లల కంటే ఎక్కువగా ఈ కుక్కలను ఆ దంపతులు ప్రేమిస్తారు.పిల్లలు లేని ఆ దంపతులు కుక్కలనే తమ పిల్లలుగా భావిస్తున్నారు ముంబైకి చెందిన నందిని సుచ్ దేవ్, నిమేష్ సుచ్ దేవ్ దంపతులు.

పెంపుడు జంతువులను పెంచుకోవడం సాధారణమే.అయితే పెంపుడు జంతువులపై కొంత వరకే ప్రేమ ఉంటుంది.అయితే ముంబాయికి చెందిన ఓ జంట మాత్రం ఆ కుక్కలపై చూపుతున్న ప్రేమ అంత ఇంత కాదు.

పిల్లల కోసం ఆరాట పడే సమయంలో కృత్రిమ గర్భదారణ కోసం కూడ ఆ దంపతులు ప్రయత్నించారు కాని ఫలితం లేకపోయింది.అదే సమయంలో కుక్కలను సాకడం ప్రారంభించారు. తమ పిల్లలకంటే ఎక్కువ ప్రేమను ఈ కుక్కలపై చూపుతున్నారు ఆ దంపతులు.

కుక్కలను కన్న పిల్లల కంటే ఎక్కువగా ప్రేమిస్తారు.అందుకే వీటిని కుక్కలంటే ఆ దంపతులు సహించరు. వెంటనే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తారు.గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన కుక్కలను బంగారం మాదిరిగానే చూసుకొంటున్నారు ఆ దంపతులు.ఈ కుక్కలకు పేర్లు కూడ పెట్టారు. బడ్డీ, టైనీ అనే పేర్లు పెట్టి వీటిని అతి గారాబంగా చూసుకొంటారు.

పిల్లలు లేని టోటును తీర్చిన కుక్కలు

పిల్లలు లేని టోటును తీర్చిన కుక్కలు

సాధారణంగా కుక్కలను పెంపుడు జంతువులుగానే చూస్తాం. కాని, కుక్కలను తమ పిల్లలుగా చూసుకొంటున్నారు ముంబాయికి చెందిన నందిని, నిమేష్ దంపతులు,.వారికి పిల్లలు లేరు.అయితే పిల్లల కోసం వారు చాలా కాలం పాటు ప్రయత్నించారు. కృత్రిమ పద్దతిలో గర్భదారణ కోసం ప్రయత్నాలు చేశారు,అదే సమయంలో నిమేష్ ఇంటికి తెచ్చిన కుక్కలను పిల్లలుగా చూసుకోవడం ప్రారంభించారు దంపతులు. ఆనాటి నుండి వారిద్దరూ కూడ ఆ కుక్కలను తమ పిల్లలుగానే భావిస్తారు.

గోల్డెన్ రిట్రీవర్ జాతి కుక్కలకు బంగారు గొలుసులు

గోల్డెన్ రిట్రీవర్ జాతి కుక్కలకు బంగారు గొలుసులు

కుక్కలను ఇంట్లో గొలుసులతో బందిస్తాం..అయితే నందిని దంపతులు మాత్రం గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన కుక్కలను మాత్రం గొలుసులతో బందించరు. ఈ కుక్కలు రెండింటి మెడలో బంగారు గొలుసులను వేశారు. తమ పిల్లలను ఏ రకంగా చూసుకొంటారో అలానే ఈ కుక్కలను చూసుకొంటారు.

కుక్కలకు వెండి ప్టేట్లలో భో్జనం

కుక్కలకు వెండి ప్టేట్లలో భో్జనం

కుక్కలకు బోజనం పెట్టేందుకు సాదారణంగా ప్రత్యేకమైన ప్లేట్లు పెడతారు.అయితే ఈ దంపతులు మాత్రం వెండి ప్లేట్లలో భోజనం పెడతారు. ఒక వేళ కుక్కలు తినగా మిగిలిన ఆహర పదార్థాలను పారేస్తాం. కాని, ఈ దంపతులు మాత్రం కుక్కలు మిగిల్చిన ఆహరపదార్థాలను మాత్రం ఆ దంపతులు తింటారు.

ప్రేమ పెళ్ళి చేసుకొన్న నందిని , నిమేష్

ప్రేమ పెళ్ళి చేసుకొన్న నందిని , నిమేష్

1998 లో ముంబాయికి వచ్చిన నందిని, గుజరాత్ కు చెందిన వ్యాపారవేత్త నిమేష్ తో ప్రేమలో పడ్డారు. ఇద్దరూ కూడ 2002 లో పెళ్ళి చేసుకొన్నారు. అయితే పిల్లలు పుడతారని భావిస్తే వారికి కష్టాలు మొదలయ్యాయి. అబార్షన్ అయింది. వారి ఆశలు ఆవిరయ్యాయి. దీంతో ఐవిఎఫ్ చికిత్సను కూడ ప్రారంభించారు.అదే సమయంలో కుక్కలను పెంచుకోవడం ప్రారంభించారు. కుక్కలనే తమ పిల్లలుగా సాకడం ప్రారంభించారు.

రూ.5 కోట్ల ఆస్తులు కుక్కల పేరు మీద రాయనున్న దంపతులు

రూ.5 కోట్ల ఆస్తులు కుక్కల పేరు మీద రాయనున్న దంపతులు

హృద్రోగంతో నందిని బాధపడుతోంది. అయతే తనకు ఏ సమయంలో ఏ రూపంలో మృత్యువు ముంచుకొస్తోందోననే భయం ఆమెను వెన్నాడుతోంది.దీంతో ఆ దంపతులు కుక్కల పేరున రూ.5 కోట్ల రూపాయాల ఆస్తిని రాయాలని నిర్ణయించుకొన్నారు. కొలాబా మజీర్ బందర్ ప్రాంతాల్లోని రెండు ప్లాట్లు, కోల్ కత్తాలోని ఒక అపార్ట్ మెంట్ , ఇతర ఆస్తులు అన్నీ కలిపి రూ.5 కోట్ల విలువైన వాటిని కుక్కలకు ఇవ్వాలని నిర్ణయించుకొన్నారు.

కుక్కల కోసం ట్రస్టు ఏర్పాటు

కుక్కల కోసం ట్రస్టు ఏర్పాటు

వీరికి మూడు కుక్కలు ఉండేవాి.అయితే వాటిలో జూనియర్ అనే కుక్క గత ఏడాది డిసెంబర్ మాసంలో చనిపోయింది. అయినా ఈ మూడు కుక్కల పేరునే ఓ ట్రస్టును ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఆ ట్రస్టు ఖాతాలోనే వేసే డబ్బులతో కుక్కల సంక్షేమం చూస్తారు. ఈ రెండు కుక్కలతో పాటు ఎవరూ పట్టించుకోని ఇతర కుక్కలను కూడ ట్రస్టు ఆధ్వర్యంలో సంరక్షణ బాధ్యతలను స్వీకరించాలని భావిస్తున్నారు. ట్రస్టు ఆధ్వర్యంలో ఒక అంబులెన్స్, మందులు, కుక్కలకు ఉచిత చికిత్స ఏర్పాటు చేస్తున్నారు. దంపతులిద్దరూ ఈ ట్రస్టు నుండి ఒక సొమ్ము కూడ తీసుకోవడానికి వీలుండదు.

English summary
"Don't call them dogs, they are my bachchas," said Nandini Suchde (52) of her beloved Buddy and Tiny, as she lovingly puts gold chains around their necks, giving new meaning to 'Golden' Retrievers. If you think that's excessive, then dig this - the precious pooches will soon become the richest dogs in Mumbai, named as the sole heirs to a cool Rs 5 crore from their human 'parents'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X