ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం : అంబాసిడర్‌గా ట్రాన్స్‌జెండర్ నియామకం

ముంబై : సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్ల చేస్తోంది. ఓటరు జాబితా సవరణ కోసం చివరి వరకూ అవకాశం కల్పించడం, రాజకీయ పార్టీలు లేవనెత్తిన సందేహాలు తీరుస్తోంది. ఈ క్రమంలో పోలింగ్ పర్సంటేజీ పెంచేందుకు కూడా చర్యలు చేపడుతోంది. వయోజనుల్లో అవగాహన కల్పించేందు కోసం 12 ఎన్నికల ప్రచారకర్తలను కూడా నియమించింది. వీరిలో ముంబైకి చెందిన ఒక ట్రాన్స్‌జెండర్ ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

12 మందిలో .. ఒకరు ట్రాన్స్‌జెండర్

12 మందిలో .. ఒకరు ట్రాన్స్‌జెండర్

దేశ ఎన్నికల చరిత్రలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. తొలిసారి ఓ ట్రాన్స్‌జెండర్‌ను ప్రచారకర్తగా నియమించి ఓటు పర్సంటేజీ పెంచేందుకు కీలక చర్యలు చేపట్టింది. ముంబైకి చెందిన సామాజిక వేత్త శ్రీ గౌరి సావంత్ (38) వివిధ కార్యక్రమాలు చేపట్టి .. పేరొందారు. ఈ క్రమంలోనే ఆమె పేరును పరిశీలించి .. ఆమోదించింది ముంబై ఎన్నికల సంఘం

ఓటు రాజ్యంగబద్ధ హక్కు

ఓటు రాజ్యంగబద్ధ హక్కు

ఓటు అనేది రాజ్యాంగబద్ధ హక్కు అని, సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు శ్రీగౌరి సావంత్. ఒటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సూచించారు. ఓటు వేసేవారిని పోలింగ్ బూతుల వద్దకు తీసుకెళ్లేందుకు మా యూనియన్ తరఫున సహకారం అందిస్తామని పేర్కొన్నారు. గతంలో జరిగిన పలు ఎన్నికల్లో వృద్దులను పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లి .. ఓటు వేయించామని చెప్పారామె.

అంబాసిడర్‌గా ఎందుకంటే ..?

అంబాసిడర్‌గా ఎందుకంటే ..?

ఇంట్లో ఉండే ప్రతి మహిళ విధిగా ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు. ఒక మహిళలే కాదు సెక్స్ వర్కర్లు, ట్రాన్స్‌జెండర్లు కూడా ఓటు వినియోగించుకోవాలని సూచించారు. వారికున్న రాజ్యాంగబద్ధ హక్కును వినియోగించుకోని ప్రభుత్వం ఏర్పడేందుకు దోహదపడాలన్నారు. ఇదివరకు ప్రజలతో ఓటు వేయించనందుకే తనను అంబాసిడర్‌గా నియమించారని .. లింగభేదం చూపించి కాదని స్పష్టంచేశారు.

గణేశ్ సురేశ్ సావంత్ టు శ్రీ గౌరి సావంత్

గణేశ్ సురేశ్ సావంత్ టు శ్రీ గౌరి సావంత్

అబ్బాయిగా జన్మించిన సావంత్ .. లింగమార్పిడి ద్వారా అమ్మాయిగా మారోపోయారు. పుణే నుంచి ముంబైకి తన మకాం మార్చాక సఖి ఛార్ చౌఘి పేరుతో ఒక స్వచ్చంద సంస్థ నెలకొల్పారు. దీంతో ఆరోగ్య సమస్యలు, లైంగిక అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే 2001లో ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. కానీ ఆ అమ్మాయి హెచ్ఐవీ వైరస్‌తో తర్వాత చనిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+